పీకే సక్సెస్ రేట్ ఎంతో ఇప్పుడు తేలనుందా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేట్ మరికొద్దినెలల్లో తేలిపోనుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ పరిస్థితి తేలనుంది. ఇప్పటి వరకూ ప్రశాంత్ [more]

Update: 2021-01-22 16:30 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేట్ మరికొద్దినెలల్లో తేలిపోనుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ పరిస్థితి తేలనుంది. ఇప్పటి వరకూ ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీల్లో ప్రముఖ వ్యక్తిగా మారారు. ఆయన డీల్ కు అంగీకరిస్తే చాలన్న పరిస్థితుల్లో పార్టీలు ఉన్నాయి. వరస విజయాలతో ఊపు మీదున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కొత్త ఏడాది లో జరిగే ఎన్నికలు ఎలాంటి అనుభవాలు పంచుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది.

వరస సక్సెస్ లతో…..

ప్రశాంత్ కిషోర్ మంచి ఎన్నికల వ్యూహకర్త. ఆయన టీంతో దిగితే విజయం ఖాయమన్న ధీమా అనేక రాజకీయ పార్టీల్లో నెలకొంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ 151 సీట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ టీం కృషి ఉంది. ఏపీలో విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఈఎన్నికల్లోనూ అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించడంతో ఆయనకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది.

అభ్యర్థుల ఎంపిక నుంచి…..

అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ అంతా ప్రశాంత్ కిషోర్ టీం చూస్తుండటం, సర్వే నివేదికలు ఎప్పటికప్పడు ఇచ్చి అప్రమత్తం చేస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఆయన వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో తమిళనాడు, పశ్చిమబెంగాల్ లోనూ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేకి కావడంతో బీజేపీయేతర పార్టీలే ఆయన వైపు చూస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ రెండు విడతలుగా అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ ని తట్టుకోవడానికి ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకుంటున్నారు.

ఈ రెండు రాష్ట్రాల్లో….

ఇక తమిళనాడులో సయితం ప్రతిపక్ష డీఎంకే తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంది. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రానని చెప్పడంతో ఇక్కడ పీకే కు గెలుపు సులువే. అయినా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో గెలుపోటములపైనే ప్రశాంత్ కిషోర్ క్రేజ్ ఆధారపడి ఉంది. ఇప్పటికే పంజాబ్ లో కాంగ్రెస్, కర్ణాటకలో కుమారస్వామి కూడా ఆయనను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. తమిళనాడు, బెంగాల్ ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేట్ ఎంతనేది తేలిపోనుంది.

Tags:    

Similar News