ప్రశాంత్ కిషోర్ ను భరించడం కష్టమే…అయినా?

ప్రశాంత్ కిశోర్‌. ఎన్నికల వ్యూహ‌క‌ర్తగా పేరు తెచ్చుకున్న ఈయ‌న‌కు.. దేశ‌వ్యాప్తంగా మంచి పేరుంది. అస‌లు అధికారం ద‌క్కుతుందో లేదో.. అనే పార్టీల‌ను కూడా అధికారంలోకి తీసుకువ‌చ్చిన ఘ‌న‌త‌ను [more]

Update: 2021-05-11 12:30 GMT

ప్రశాంత్ కిశోర్‌. ఎన్నికల వ్యూహ‌క‌ర్తగా పేరు తెచ్చుకున్న ఈయ‌న‌కు.. దేశ‌వ్యాప్తంగా మంచి పేరుంది. అస‌లు అధికారం ద‌క్కుతుందో లేదో.. అనే పార్టీల‌ను కూడా అధికారంలోకి తీసుకువ‌చ్చిన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీని ముఖ్యంగా న‌రేంద్ర మోడీని ప్రధానిని చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్‌ త‌ర్వాత‌..బిహార్‌లో రెండోసారి నితీష్‌కుమార్‌ను అధికారంలోకి తీసుకురావ‌డం ద్వారా దేశం మొత్తం ఆయ‌న‌వైపు చూసేలా చేసుకున్న వ్యూహ‌క‌ర్త. ఆ త‌ర్వాత ఢిల్లీలో కేజ్రీవాల్‌కు వ్యూహ‌క‌ర్తగా ప‌ని చేసి వ‌రుస విజ‌యాల‌తో జాతీయ రాజ‌కీయాల్లో పెద్ద సంచ‌ల‌నం రేపారు.

కష్టానికి తగినట్లు…

దాదాపు 250 మంది బృందంతో ప్రశాంత్ కిశోర్‌ తను ఎంచుకున్న పార్టీకి, రాష్ట్రానికి సేవ చేస్తున్నారు. ఎన్నిక‌ల గోదాలోకి ఆయ‌న దిగారంటే.. ప్రత్యర్థి పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. గ‌తంలో అంటే.. 2019లో ఏపీలో జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ఆయ‌న అంతా ఇంతా శ్రమించ‌లేదు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఆయ‌న చేసే ప‌నికి అంత‌కు రెండింత‌లు డ‌బ్బులు లాగేస్తార‌న్న టాక్ ఉంది. అయినా.. కూడా అనుకున్నది సాధించేందుకు పార్టీలు పీకే చుట్టూ తిరుగుతున్నాయి. ఇక‌, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు కీల‌క పార్టీలు.. ముందుగానే ఆయ‌న కాల్ షీట్లు రిజ‌ర్వ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ తరుపున…

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నడూ లేని విధంగా ఇటీవ‌ల ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపులు జ‌రిపిన‌ట్టు తెలంగాణ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రస్తుతం బెంగాల్ ఎన్నిక‌లు పూర్తయ్యాయి. తర్వాత పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రశాంత్ కిశోర్‌ పనిచేస్తారు. తెలంగాణ‌లో అధికార పార్టీని తిరిగి ముచ్చట‌గా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు రు. 5 వంద‌ల కోట్ల ప్యాకేజీకి బేరాలు ఆడుతున్నార‌ని తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ రు. 200 కోట్లు ఇస్తాన‌ని చెబుతున్నట్టు స‌మాచారం. గ‌తంలో జ‌గ‌న్‌ను అధికారంలోకి తెచ్చేందుకు 150 కోట్లు తీసుకున్నట్టు ప్రచారం జ‌రిగింది. అయిన‌ప్పటికీ.. టీఆర్ఎస్‌లో కొంద‌రు యువ నేత‌లు.. పీకే సేవ‌ల‌కు మొగ్గు చూపుతున్నారు.

మరోసారి జగన్ కు…?

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. మ‌ళ్లీ జ‌గ‌న్‌.. ప్రశాంత్ కిశోర్‌ సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు ఇప్పటికే క‌ర్చీఫ్ వేశార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ప్రశాంత్ కిశోర్‌ తో ఆయ‌న సైలెంట్‌గా భేటీ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజయం ద‌క్కించే బాధ్యత‌ల‌ను పీకేకే అప్పగించిన‌ట్టు ఏపీలోనూ ప్రచారం జ‌రుగుతోంది. అయితే.. ఇక్కడ ఎంత తీసుకుంటార‌నే విష‌యం గోప్యంగా ఉన్నా… రు. 200 కోట్లకు ఏమాత్రం త‌క్కువ ఉండ‌ద‌ని చెబుతున్నారు. మ‌రి మొత్తానికి ప్రశాంత్ కిశోర్‌ డిమాండ్ భారీ రేంజ్‌లో ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే బీహార్ ఎన్నికల తర్వాత తాను ఎవరికి వ్యూహకర్తగా పనిచేయనని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమేనని, ఆయనను నమ్ముకుని ఐప్యాక్ సిబ్బంది వేల సంఖ్యలో ఉన్నారంటున్నారు.

Tags:    

Similar News