మమతకే కాదు పీకే కూడా ఛాలెంజేగా?

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. బీజేపీ ఇక్కడ దూకుడు పెంచుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలను వరస పెట్టి పార్టీ కండువాలను కప్పేస్తుంది. వరసగా పార్టీ నేతలు [more]

Update: 2021-03-12 16:30 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. బీజేపీ ఇక్కడ దూకుడు పెంచుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలను వరస పెట్టి పార్టీ కండువాలను కప్పేస్తుంది. వరసగా పార్టీ నేతలు వీడుతుండటం, ముఖ్యమైన, సన్నిహితులు కూడా దూరం అవుతుండటంతో మమత బెనర్జీ మానసికంగా అప్ సెట్ అయ్యారు. అయితే విజయం తనదేనన్న ధీమాలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర కీలకంగా చెబుతున్నారు.

రెండేళ్ల నుంచి……

గత రెండేళ్ల నుంచి ప్రశాంత్ కిషోర్ మమత బెనర్జీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా నియమించు కున్నారు. అప్పటి నుంచి ఆయన టీం బెంగాల్ లో సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మమత బెనర్జీకి రిపోర్టులు ఇస్తుంది. దానికి అనుగుణంగా మమత బెనర్జీ చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో సువేందు అధికారి వంటి నేతలు కూడా పార్టీని వీడటంతో నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మమత బెనర్జీ సిద్ధమయ్యారు.

ిపార్టీ వీడిన నేతల నియోజకవర్గాల్లో…..

ఇప్పుడు మమత బెనర్జీ ప్రశాంత్ కిషోర్ పై పెద్ద బాధ్యతలను మోపారు. పార్టీని వీడిన నేతలు గెలవకూడదని, అందుకు అనుగుణంగా వ్యూహాలను రచించాలని ప్రశాంత్ కిషోర్ కు అప్పజెప్పారు. నందిగ్రామ్ తో సహా పార్టీ వీడిన నేతల నియోజకవర్గాలను ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే సర్వేలను ప్రారంభించింది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా ప్రశాంత్ కిషోర్ స్వయంగా చూస్తున్నారు.

గతంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో….

ివీటితోపాటు గత లోక్ సభ ఎన్నికలలో టీఎంసీ పరాజయం పాలయిన లోక్ సభ స్థానాల పరిధిలో ఉన్న శాసనసభ స్థానాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా జంగల్ మహాల్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, గిరిజన ప్రాంతాల్లో టీఎంసీ బలహీనంగా ఉందని గుర్తించారు. ఇక్కడ అభ్యర్థులను కూడా మార్చాలని ప్రశాంత్ కిషోర్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇటు మమత బెనర్జీకే కాకుండా ప్రశాంత్ కిషోర్ కు కూడా సవాల్ గా మారాయి.

Tags:    

Similar News