పీకే ఇక్కడ గట్టెక్కిస్తారా…??
నితీష్ కుమార్… క్లీన్ ఇమేజ్.. చిన్న మచ్చ లేని నేత. ఆయన ప్రస్తుత రాజకీయాల్లోనే విభిన్నమైన నేత. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలు నితీష్ కుమార్ [more]
నితీష్ కుమార్… క్లీన్ ఇమేజ్.. చిన్న మచ్చ లేని నేత. ఆయన ప్రస్తుత రాజకీయాల్లోనే విభిన్నమైన నేత. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలు నితీష్ కుమార్ [more]
నితీష్ కుమార్… క్లీన్ ఇమేజ్.. చిన్న మచ్చ లేని నేత. ఆయన ప్రస్తుత రాజకీయాల్లోనే విభిన్నమైన నేత. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలు నితీష్ కుమార్ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అవినీతికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరుగా ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే బలమైన పార్టీలు ప్రత్యర్థులుగా ఉండటంతో నితీష్ ను ఈ ఎన్నికల ఫలితాలు ముంచుతాయా? తేలుస్తాయా? అన్నది చూడాల్సి ఉంది. నితీష్ కుమార్ కు బీహార్ లో మంచిపేరున్నప్పటికీ ఆయన జత కట్టిన పార్టీలపై ఉన్న అసంతృప్తికి బలవుతారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
నితీష్ భవితవ్యం….
నలభై పార్లమెంటు స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో జనతాదళ్ యు అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టి పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మహా గడ్బంధన్ లో పార్టనర్ గా ఉన్న నితీష్ రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీల సహకారంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల అవినీతి ఆరోపణల కారణంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే బీజేపీ నితీష్ ను సంప్రదించి మద్దతు ప్రకటించింది. బీహార్ పరిపాలనలో బీజేపీ కూడా భాగస్వామిగా మారింది. నేరాలకు అడ్డా అయిన బీహార్ ను నితీష్ కుమార్ మార్చివేశారనే చెప్పాలి. మద్యపాన నిషేధం అమలు చేసి ముఖ్యంగా మహిళా ఓటర్లను చూరగొన్నారు.
బలంగా ఆర్జేడీ కూటమి….
కానీ ఇక్కడ రాష్ట్రీయ జనతా దళ్ బలంగా ఉంది. మోదీ సర్కార్ వచ్చిన తర్వాత లాలూయాదవ్ పై పాతకేసులు తిరగదోడి జైలుకు పంపారన్న సానుభూతి ప్రజల్లో బలంగా ఉంది. యాదవ సామాజిక వర్గం కూడా అధికంగా ఉండటంతో ఆర్జేడీ బాగా నిలదొక్కుకుందనే చెప్పాలి. లాలూప్రసాద్ యాదవ్ జైలులో ఉండే అభ్యర్థుల ఎంపికను చేశారు. తేజస్వియాదవ్ అంతా తానే అయి పొత్తులు కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ తో పాటు చిన్నా చితకా పార్టీలతో కలసి పోటీ చేశారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో సయితం ఆర్జేడీ విజయం సాధించడంతో అదే ఊపుమీద ఈ సార్వత్రిక ఎన్నికలకు వెళుతుంది.
భారం ప్రశాంత్ కిషోర్ పైనే….
బీహార్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో నితీష్ కుమార్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు జనతాదళ్ యు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. నితీష్ తర్వాత ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రశాంత్ కిషోర్ తన టీంలతో బీహార్ లో సర్వేలు చేయించి మరీ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారు. బీజేపీతో జత కట్టడం వెనక కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందంటున్నారు. తన పార్టీ లోక్ సభ ఎన్నికల్లో గెలిస్తేనే ప్రజల విశ్వాసం పొందినట్లు ఆయన భావిస్తున్నారు. ఏదైనా తేడా వస్తే ఆయన రాజీనామా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ ను గట్టెక్కిస్తారో? లేదో? చూడాలి.