ఇలా కాశ్మీర్ లో ఎప్పుడైనా చూశామా? విన్నామా?

జమ్ముకాశ్మీర్ కు, అధికరణ 370, 35ఎ లకు అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు అధికరణలలో ఆ రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తి, కొన్ని ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నాయి. [more]

Update: 2020-04-11 16:30 GMT

జమ్ముకాశ్మీర్ కు, అధికరణ 370, 35ఎ లకు అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు అధికరణలలో ఆ రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తి, కొన్ని ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నాయి. వీటిని బీజేపీ మెుదటి నుంచి వ్యతిరేకిస్తుండగా దేశంలోని మిగిలిన అన్ని పార్టీలు సమర్ధిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చినవెంటనే భాజపా అనుహ్యంగా 370 అధికరణ రద్దు అంశాన్ని తెరపైకి తెచ్చింది. గత ఏడాది ఆగస్టు మెుదటి వారంలో రాజ్యసభలో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టి కొన్ని గంటల్లోనే ఆమెాదం పొంద గలిగింది. వాస్తవానికి పెద్దల సభలో కమలం పార్టీకి బలం లేనప్పటికీ ఇతర మిత్రపక్షాల మద్దతుతో నెగ్గుకొచ్చింది. దీంతో సంపూర్న ఆధిక్యం గల లోక్ సభలో ప్రభుత్వానికి తిరుగు లేకుండా పోయింది.

ఎంతో మంది ఎన్నో రకాలుగా…

ఈ రెండు అధికరణల రద్దు సందర్బంగా కాశ్మీర్ అగ్ని గుండంగా మారుతుందని, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్దిత మరీ దిగజారుతుందన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఉగ్రవాదులు మరింత రెచ్చి పోతారని, స్ధానిక ప్రజలు అధికరణల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తారని, అంతర్జాతీయ సమాజం నుంచి అభ్యంతరాలు, విమర్శలు, వాదనలు ఎదురవుతాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ పరిస్ధితిని ప్రభుత్వం ఎలా అధిగమించగలదో అన్న ఆందోళన కుాడా వ్యక్తమైంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ పరిస్ధితులు కుదుట పడుతున్నాయి. సంక్షోభిత జమ్మూ కాశ్మీర్లో శాంతి పవనాలు వీస్తున్నాయి. ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రజలు కూడా క్రమంగా పరిస్ధితులకు అలవాటుపడుతున్నారు. సాధారణ కార్యక్రలాపాలకు, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగడం లేదు.

పాక్ మినహా మిగిలిన దేశాలు….

ఒక్క పాక్ మినహా అంతర్జాతీయ సమాజం ఈ విషయాన్ని ఏనాడో మర్చిపోయింది. ఇస్లామిక్ దేశాలు కూడా కాశ్మీర్ విషయం భారత్-పాక్ ద్వైపాక్షిక సమస్య అని తాము చేయగలిగింది ఏమీలేదనే అభిప్రాయానికి వచ్చాయి. అమెరికా, చైనా వంటి అగ్ర రాజ్యాలు రెండు దేశాలు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధం అంటూ మాట్లాడటానికే పరిమితం అవుతున్నాయి. ఇటీవల లోక్ సభలో జరిగిన చర్చ సందర్బంగా కేంద్రం ఈ విషయాన్ని స్నష్టం చేసింది కాశ్మీర్ కు బడ్జెట్ కేటాయింపు సందర్భంగా కేంద్రహోంశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ కాశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విస్పష్టంగా వ్యాఖ్యానించారు. జితేంద్ర సింగ్ జమ్ము ప్రాంతంలోని ఉధంపూర్ లోక్ సభ స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గృహనిర్బంధం నుంచి….

370 అధికరణ రద్దు సందర్భంగా గత ఏడాది ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఫరుక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మె‍హబూబా ముఫ్తీ లను గృహ నిర్బంధం చేశారు. ప్రజాభద్రతా చట్టం కింద అరెస్టెయిన వీరిలో ఫరూక్ ను ఇటీవల విడుదల చేశారు. మిగిలిన ఇద్దరు సీఎంలు నిర్బంధంలోనే ఉన్నారు. ఇదొక్కటీ ఇబ్బందికరమైన అంశం. ఉగ్రవాద కారణంగా గత మూడు శాఖల్లో 40 వేల మంది ప్రణాలు కోల్నోయారు. గత ఏడాది ఆగస్టు నుంచి జరిగిన ఉగ్రవాద ఘటనలు కానీ,మృతుల సం‌ఖ్య కానీ చాలా పరిమితమే అని చెప్పాలి. భద్రతా దళాల పరంగా జరిగిన నష్టం కూడా తక్కువే. ఇప్పుడిపుడే రాష్ట్ర పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాలు ఒకింత ఊపిరి నీల్చుకుంటున్నాయన్నది వాస్తవం. 370 రద్దు తరువాత రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ళలో 13 శాతం పెరిగాయి. ఎక్సైజ్ ఆదాయం 7.5 శాతం పెరిగింది. దాదాపు 60 వేలమంది పింఛనుదారులు వివిధ ప్రభుత్వ పధకాల నుంచి లబ్ధి పొందుతున్నారు. సీఎం ఆవాన్ యెాజనకింద 18,534 కొత్త ఇళ్ళను నిర్మించారు. ప్రభుత్వ నిధుల వినియెాగం 48 శాతం పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతోంది. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం ఒక్క ఎయిమ్స్ కుాడా లేదు. రాష్ట్రంలో రెండు ఎయిమ్స్ లు, 9 వైద్య కళాశాలలు ఉండటం విశేషం. బ్రాడ్ బ్యాండ్, ల్యాండ్ లైన్, వైఫై సేవలను పునరుద్ధరించారు. ఉగ్రవాద భయంతో అంతర్జాల సౌకర్యాన్ని నిలిపేశారు. ఎక్కడా కర్ఫ్యూ లేదు. 144 వ సెక్షన్ మాత్రమే అమల్లో ఉంది. మెుత్తం మీద సరిహద్దు రాష్ట్రం ఇపుడిపుడే కుదుట పడుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News