ఆర్ఎస్ఎస్ నుంచి అక్షింతలు పడ్డాయా?
మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పటి వరకూ బీజేపీని పార్టీగా చూసిన ప్రజలు మోదీని బీజేపీగా చూస్తున్నారని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. మోదీ కారణంగా బీజేపీ మూలాలకే ఎసరు [more]
మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పటి వరకూ బీజేపీని పార్టీగా చూసిన ప్రజలు మోదీని బీజేపీగా చూస్తున్నారని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. మోదీ కారణంగా బీజేపీ మూలాలకే ఎసరు [more]
మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పటి వరకూ బీజేపీని పార్టీగా చూసిన ప్రజలు మోదీని బీజేపీగా చూస్తున్నారని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. మోదీ కారణంగా బీజేపీ మూలాలకే ఎసరు వచ్చేలా ఉందని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఇప్పుడు కష్టాల్లో ఉన్నట్లు ఆర్ఎస్ఎస్ గుర్తించింది. రానున్న కాలం బీజేపీకి కష్టమేనన్న అభిప్రాయాన్ని సంఘ్ పరివార్ వ్యక్తం చేస్తుంది.
గెలుపులన్నీ…?
ఇప్పటివరకూ బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలవడానికి మోదీ ఇమేజ్ మాత్రమే కారణం. మోదీ, షాల వ్యూహాల కారణంగానే మొన్నటి వరకూ బీజేపీకి తిరుగులేకుండా పోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ మోదీ ప్రభంజనంతోనే భారీ మెజారిటీతో ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికివచ్చింది. కానీ రెండేళ్లుగా మోదీ గ్రాఫ్ పడిపోతుందని ఆర్ఎస్ఎస్ గుర్తించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కూడా ఆర్ఎస్ఎస్ విశ్లేషించినట్లు వార్తలు వస్తున్నాయి.
బెంగాల్ లో ఓటమికి?
ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి పెద్దయెత్తున నేతలను చేర్చుకోవడాన్ని ఆర్ఎస్ఎస్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే బెంగాల్ లో ఓటమి ఎదురయిందని ఆర్ఎస్ఎస్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పనికి రారని తెలిసినా కొందరిని పార్టీలోకి చేర్చుకుని నష్టం చేకూర్చారని పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ అక్షింతలు వేసినట్లు చెబుతున్నారు.
సెకండ్ వేవ్ పై…?
దీంతో పాటు కరోనా సెకండ్ వేవ్ తో మోదీ ఇమేజ్ మరింత పడిపోయినట్లు ఆర్ఎస్ఎస్ ఒక నివేదికను పార్టీకి ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రజలను పట్టించుకోక పోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ ప్రబలినట్లు పేర్కొంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సయితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, లేకుంటే పార్టీకి ముందుముందు కష్టాలేనని ఆర్ఎస్ఎస్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.