వారధిగా నిలుస్తున్నారా?
ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి భవిష‌్యత్ ఆశాకిరణంగా భావిస్తున్నారు. ఇటు తల్లి, అటు సోదరుడిని గౌరవిస్తూనే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. అనేక సమయాల్లో [more]
ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి భవిష‌్యత్ ఆశాకిరణంగా భావిస్తున్నారు. ఇటు తల్లి, అటు సోదరుడిని గౌరవిస్తూనే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. అనేక సమయాల్లో [more]
ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి భవిష‌్యత్ ఆశాకిరణంగా భావిస్తున్నారు. ఇటు తల్లి, అటు సోదరుడిని గౌరవిస్తూనే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. అనేక సమయాల్లో పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇది నేతలకు, క్యాడర్ కు కొండంత ధైర్యాన్ని, భరోసా ఇచ్చే అంశంగా కాంగ్రెస్ నేతలు పరిగణిస్తున్నారు. ప్రియాంక గాంధీ సీినియర్ నేతలను గౌరవిస్తూనే యువకులను ప్రోత్సహిస్తుడటంతో ఆమె ఫ్యూచర్ పాలిటిక్స్ కేరాఫ్ అవుతారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది.
అధికారంలో ఉన్నప్పుడు…..
నిజానికి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ప్రియాంక గాంధీ రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. అంతేకాదు పార్టీలోనూ ఎలాంటి పదవులను తీసుకోలేదు. తల్లి, సోదరుడు పోటీ చేస్తే అమేధీ, రాయబరేలీ ప్రాంతాల్లో ప్రచారానికి మాత్రం ప్రియాంక గాంధీ వెళ్లేవారు. అప్పటి నుంచే ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలంటూ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ పెరిగింది. అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ క్యాడర్ ప్రియాంకను తమ నేతగా కోరుకుంది.
ఓటమి దగ్గర నుంచి….
అయితే కాంగ్రెస్ ఓటమి పాలయిన దగ్గరనుంచి పార్టీకి అండగా నిలబడాలని నిర్ణయించుకుని ప్రియాంక గాంధీ యాక్టివ్ అయ్యారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పార్టీలో ఆమె అవసరం మరింత పెరిగింది. ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సోదరుడు రాహుల్, తల్లి సోనియా మనసులో మాటలను గ్రహించి వాటిని పార్టీ సీనియర్ నేతలకు కూడా చేరవేస్తున్నారు.
కీలక సమయాలలో….
తాజాగా సచిన్ పైలట్ ను పార్టీలో ఉండేలా ప్రియాంక గాంధీ చివరి క్షణం వరకూ ప్రయత్నించారు. సచిన్ పైలట్ తో మంతనాలు జరిపారు. ఆయన ససేమిరా అనడంతో సోనియాతో సమావేశమై ఆమె ఆదేశాలను రాజస్థాన్ పార్టీ నేతలకు అందించారు. ప్రియాంక నుంచి వచ్చిన ఆదేశాల తర్వాతనే సచిన్ పైలట్ ను పీసీసీ చీఫ్ నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించారు. రాజస్థాన్ కొత్త అధ్యక్షుడిని నియమించారు. మొత్తం మీద ప్రియాంక గాంధీ పార్టీ నేతలకు, గాంధీ కుటుంబానికి వారధిగా మారారు. ప్రియాంక గాంధీ పార్టీలో యాక్టివ్ కావడం నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనే చెప్పాలి.