వదినమ్మ మీదనే వల్లమాలిన ఆశలు..?

వదినమ్మ అంటే మరెవరో కాదు చిన్నమ్మ. ఎన్టీయార్ కి ఆమె చిన్నమ్మ. చంద్రబాబుకు వదినమ్మ. మొత్తానికి దగ్గుబాటి వారి ఇంటి కోడలు పురంధేశ్వరి కి పుట్టింటి ప్రేమ [more]

Update: 2020-10-05 00:30 GMT

వదినమ్మ అంటే మరెవరో కాదు చిన్నమ్మ. ఎన్టీయార్ కి ఆమె చిన్నమ్మ. చంద్రబాబుకు వదినమ్మ. మొత్తానికి దగ్గుబాటి వారి ఇంటి కోడలు పురంధేశ్వరి కి పుట్టింటి ప్రేమ పోలేదు అని అంటున్నారు. ఆమె తన తండ్రి స్థాపించిన టీడీపీకి జవసత్వాలు అందించేలా అటునుంచి నరుక్కు వస్తారా అన్న చర్చ అయితే టిడీపీలో సాగుతోంది. పురంధేశ్వరిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దాంతో ఆమెకు అధినాయకత్వం నుంచి మంచి గుర్తింపు లభించినట్లు అయింది. దాంతో చిన్నమ్మ పెద్ద మాటలే మాట్లాడుతున్నారు. వస్తూనే జగన్ సర్కార్ మీద ఫిర్యాదులు చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు.

మరిది మాటకే….

ఇక అమరావతి రాజధాని విషయంలో బీజేపీలోని అయోమయాన్ని పురంధేశ్వరి తన మాటల ద్వారా మరో మారు బయటపెట్టారు. కేంద్రంలోని ప్రభుత్వం కానీ, ఏకంగా జాతీయ బీజేపీ నేతలు కానీ రాజధాని అన్నది రాష్ట్ర పరిధిలోని అంశమని పదే పదే చెబుతూ వచ్చారు. కానీ దానికి భిన్నంగా చిన్నమ్మ మరిది చంద్రబాబు మాటలకే జై కొడుతున్నారు. అమరావతి అన్నది ఏపీకి రాజధానిగా ఉండాలన్నదే తమ అభిప్రాయం అని చెబుతున్నారు. అంతే కాదు, దాని కోసం పనిచేస్తామని అంటున్నారు. నిజంగా ఇవి చంద్రబాబు చెవిన అమృతం లాంటి మాటలే మరి.

కొత్త ఊసులే …..

ఇక పురంధేశ్వరికి కీలక స్థానం దక్కడంతో నారా వారి ఫ్యామిలీలో కూడా హుషార్ కనిపిస్తోందిట. తమ కుటుంబానికి చెందిన వారు ఒకరు బీజేపీలో ఉన్నారు అని అతి పెద్ద ఫీలింగ్ వారిలో కనిపిస్తోందిట. ఇక కొద్ది నెలల క్రితం తమ్ముడు బాలయ్య షష్టి పూర్తి వేడుకల్లో చిన్నమ్మ పాలుపంచుకున్నాడు. ఆనాడు టీడీపీని ఉద్ధరించేందుకు చేయాల్సిన కార్యక్రమాల గురించి పెద్ద చర్చ ఫ్యామిలీలో జరిగింది అని ప్రచారం అయింది. అవసరం అయితే దగ్గుబాటి, నారా వారి కుటుంబాలు సహకరించుకోవాలని కూడా బాలయ్య చేసిన ప్రతిపాదనకు అంతా అంగీకరించారని నాటి టాక్. ఇక లోకేష్ స్వయంగా పెద్దమ్మ అయిన పురంధేశ్వరితో మంచి సాన్నిహిత్యమే నెరపుతున్నారని కూడా చెబుతున్నారు.

పొత్తుల ఆశలు ……

ఈ నేపధ్యంలో చిన్నమ్మ బీజేపీలో క్రియాశీలంగా ఉండడంతో ఏపీలో బీజేపీతో కొత్త పొత్తుల ఆశలు పసుపు పార్టీలో మొలకెత్తుతున్నాయట. ఇవాళ కాకపోయినా ఎన్నికల నాటికి అయినా ఏదోఒకలా ఈ రెండు పార్టీలు కలిసేలా పురంధేశ్వరి చొరవ తీసుకుంటారని అంటున్నారు. ఎంత అయినా తండ్రి పెట్టిన పార్టీ టీడీపీ మీద చిన్నమ్మకు ప్రేమ ఉండడం సహజం. ఇక 2024 ఎన్నికల్లో బీజేపీ అండ లేకపోతే టీడీపీ కుప్పకూలడం ఖాయం. దాంతో పురంధేశ్వరి కచ్చితంగా మేలు చేసే పనే చేస్తారని అంటున్నారు. పైగా చెల్లెలు కొడుకు లోకేష్ మీద ఆమెకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, అలా తన వైపు నుంచి సాయం అందించడం ఖాయమని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణలు మేలిమలుపు తిరగడం ఖాయమని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News