చిన్నమ్మకు గిఫ్ట్ రెడీ గా ఉందా

పురంద్రీశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా సుపరిచతులు. మంచి వాగ్దాటితో ఆకట్టుకునే పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీలో పూర్తి యాక్టివ్ గా కన్పిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం [more]

Update: 2019-07-22 13:30 GMT

పురంద్రీశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా సుపరిచతులు. మంచి వాగ్దాటితో ఆకట్టుకునే పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీలో పూర్తి యాక్టివ్ గా కన్పిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పురంద్రీశ్వరి మరింతగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పురంద్రీశ్వరిని పట్టించుకోవడం లేదా? ఆమెకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం లేదా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

రాజ్యసభ సభ్యురాలిగా…..

అయితే అందుతున్న సమాచారం ప్రకారం పురంద్రీశ్వరికి రాజ్యసభ పదవి ఇచ్చే ఆలోచనలో అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెకు అమిత్ షా నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. పురంద్రీశ్వరి భారతీయ మహిళా మోర్చా జాతీయ నేతగా పార్టీకోసం కొన్నేళ్లుగా సేవలందిస్తూ వస్తున్నారు. 2014 లో మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడే పురంద్రీశ్వరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం భావించింది.

గత ప్రభుత్వ హయాంలోనే….

అయితే లోక్ సభ ఎన్నికలకు ఏడాది ముందే ఈ ఆలోచన రావడంతో అధినాయకత్వం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావించి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. అనుకున్నట్లుగానే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పురంద్రీశ్వరికి విశాఖపట్నం పార్లమెంటు టిక్కెట్ ఇచ్చింది. కానీ పురంద్రీశ్వరి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ పై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీ నుంచి జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడిగా ఇప్పటికే ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఈసారి గ్యారంటీ అట….

ఇక త్వరలో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈదఫా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో పురంద్రీశ్వరి పేరు ఖరారయినట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అందుకే పురంద్రీశ్వరి ఈ మధ్య కాలంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద చిన్నమ్మకు పదవి దక్కాలన్న ఆమె అభిమానుల కోరిక త్వరలో నెరవేరే అవకాశం.

Tags:    

Similar News