వారందరిలో ఈమె మాత్రమే బెటరట…ఎందుకంటే?

వైసీపీలో మ‌హిళా మంత్రుల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్రస్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో ముగ్గురు మ‌హిళా మంత్రులు ఉన్నారు. వీరిలో ఒక‌రు డిప్యూటీ సీఎం కూడా. హోం మంత్రిగా [more]

Update: 2020-04-18 03:30 GMT

వైసీపీలో మ‌హిళా మంత్రుల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్రస్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో ముగ్గురు మ‌హిళా మంత్రులు ఉన్నారు. వీరిలో ఒక‌రు డిప్యూటీ సీఎం కూడా. హోం మంత్రిగా మేక‌తోటి సుచ‌రిత, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా వ‌నిత‌, గిరిజ‌న సంక్షేమ మంత్రి, డిప్యూటీ సీఎంగా పుష్ప శ్రీవాణి ఉన్నారు. వీరంతా జ‌గ‌న్‌కు అత్యంత ఆత్మీయులుగా ముద్ర వేసుకున్నవారే.. అయితే ప్రస్తుతం క‌రోనా నేప‌థ్యంలో రాష్ట్రంలో మంత్రులు ప్రజ‌లకు ఏమేర‌కు అందుబాటులో ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న తెర‌మీద‌కి వ‌చ్చింది. వాస్తవానికి ముగ్గురూ కూడా జ‌గ‌న్ వ్యూహానికి అనుగుణంగా ప్రభుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లేవారే.

ఈ ఇద్దరు మంత్రులు……

అయితే, క‌రోనా నేప‌థ్యంలో మ‌హిళా మంత్రుల్లో ఎవ‌రు ప్రజ‌ల్లోకి వ‌స్తున్నారు? ఎవ‌రు ప్రభుత్వ సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్తున్నారు? అనే చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజ‌ధాని జిల్లా గుంటూరులోనే ఉన్నప్పటికీ కూడా మేక‌తోటి సుచ‌రిత ప్రజ‌ల మ‌ధ్యకు రావ‌డం లేదు. త‌న కుటుంబంతో క‌లిసి ఇంట్లోనే ఉంటు న్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే.. హొం క్వారంటైన్ చేస్తున్నారు. ఏదైనా కార్యక్రమం ఉంటే.. అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోతున్నా రు. అదికూడా ఈ ఇర‌వై రోజుల్లో కేవ‌లం ఒక్కసారంటే ఒక్క‌సారి మాత్రమే ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వ‌నిత కూడా ఇదే పంథాను అనుస‌రిస్తున్నారు.

పుష్ప శ్రీవాణి మాత్రం….

స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నప్పటికీ ఆమె ఎక్కడా ఎలాంటి కార్యక్రమానికి హాజ‌రుకావ‌డం లేదు. స్వచ్ఛందంగా కూడా ఎక్కడా ఎలాంటి కార్యక్రమం నిర్వహించ‌డం లేదు. ఏదో మొక్కుబ‌డిగా మంత్రి హోదాలో కార్యక్రమాల్లో పాల్గొన‌డం మిన‌హా ఆమె చేసేదేం ఉండ‌డం లేద‌న్న చ‌ర్చలే వినిపిస్తున్నాయి. కానీ, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాత్రం త‌న‌దైన శైలిలో త‌న నియోజ‌కవ‌ర్గం కురుపాం స‌హా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్యటిస్తున్నారు. ఇటీవ‌ల త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మాస్కులు, శానిటైజ‌ర్లు పంచారు. వారికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

నిత్యావసరాలను పంచుతూ…

ప్రజ‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను కూడా పంచారు. స్వచ్ఛంద సంస్థల‌ను ప్రోత్సహిస్తున్నారు. వారి ద్వారా నిరుపేద‌లు, వెన‌క‌బ‌డిన వ‌ర్గానికి మేలు చేసే కార్యక్రమాల‌కు పుష్ప శ్రీవాణి శ్రీకారం చుట్టారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి నిధుల‌ను కూడా ఇక్కడ క‌రోనా ఇబ్బందుల నేప‌థ్యంలో ఖ‌ర్చు చేశారు. దీంతో జ‌గ‌న్ కేబినెట్‌లోని ముగ్గురు మ‌హిళా మంత్రులు ఉన్నప్పటికీ.. పుష్ప శ్రీవాణి పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News