ఎందుకంత డిస్టెన్స్…?

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం కురుపాం నుంచి రెండు సార్లు విజ‌యం సాధించిన వైసీపీ నాయకురాలు పాముల పుష్ప శ్రీవాణిపై స్థానికంగా కొంత వ్యతిరేక‌త వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు [more]

Update: 2019-11-30 06:30 GMT

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం కురుపాం నుంచి రెండు సార్లు విజ‌యం సాధించిన వైసీపీ నాయకురాలు పాముల పుష్ప శ్రీవాణిపై స్థానికంగా కొంత వ్యతిరేక‌త వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇప్పు డు ఆమె వ్యవ‌హ‌రిస్తున్న తీరుపై నేత‌లు ఆగ్రహంతో ఉన్నారు. కురుపాంలోని చాలా ప్రాంతాలు క‌డు దూరంలో ఉంటాయి. ఆయా ప్రాంతాల‌కు వెళ్లేందుకు నాయ‌కులు తిప్పలు ప‌డే విష‌యం తెలిసిందే. అయితే, ఎన్నిక‌ల స‌మయంలో ఎంత దూర‌మైనా వ‌చ్చి ఓట్లు అభ్యర్థించే నాయ‌కులు త‌ర్వాత మాత్రం మొహం చాటేయ‌డం కామ‌నే. అయితే, నాయ‌కుల‌నుకూడా ప‌ట్టించుకోక‌పోవ‌డంపైనే ఇప్పుడు చ‌ర్చంతా సాగుతోంది.

సన్నిహిత నేతలనే…..

ప్రస్తుతం పుష్ప శ్రీవాణి.. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దీంతో కొంత‌మేర‌కు ఆమెకు స్థానిక నేత‌ల‌ను క‌లుసు కునేందుకు ప్రొటోకాల్ ఇబ్బందులు ఉన్న విష‌యం వాస్తవ‌మే. అయితే.. నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన‌ప్ప టికీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో కీల‌కంగా ప‌నిచేసి, త‌న గెలుపున‌కు కార‌ణ‌మైన వారిని ప‌ల‌క‌రించేందుకు కూడా పుష్ఫశ్రీవాణి ముందుకు రాక‌పోవ‌డం, నామినేటెడ్ ప‌ద‌వులు ఇప్పిస్తామంటూ.. ఒక‌రిద్దరికి ఇచ్చిన హామీ కూడా నెర‌వేర్చ క‌పోవ‌డంతో ప‌రిస్థితి ఆమెకు వ్యతిరేకంగా మారుతోంది. అయితే, దీని వ‌ల్ల ఇప్పటికిప్పుడు వ‌చ్చిన న‌ష్టం లేక పోయినా.. కేడ‌ర్ దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు.

కీలకనేతలతో కూడా…..

ఇదిలావుంటే, నియోజ‌వ‌క‌ర్గంలో పుష్ప శ్రీవాణిపై ఓడిపోయిన నిమ్మక జ‌య‌రాజు, జ‌నార్థన థాట్రాజ్‌లు పుంజుకునే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. పుష్ప శ్రీవాణిపై ఉన్న అసంతృప్తిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకు నేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఇక‌, రెండో సారి ఎమ్మెల్యే కావ‌డం, పైగా ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా కావ‌డంతో పుష్ప శ్రీవాణి.. త‌న పార్టీ కార్యక‌ర్తలు, నేత‌ల‌తో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నార‌నే ప్రచారం జోరుగా ఉంది. దీంతో కీల‌క నాయ‌కుల‌కు కూడా ఆమె ట‌చ్‌లో లేకుండా పోయారు. పైగా ఆమె భ‌ర్త కీల‌కంగా మారుతున్నార‌ని అంటున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల కంటే కూడా ఎక్కువ‌గా ఇక్కడి ప‌రిస్థితి అన‌నుకూలంగా మారుతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రి మున్ముందు ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో చూడాలి.

Tags:    

Similar News