పుతిన్… నయా నియంత.. కాదంటారా?
ఆధునిక పరిస్ధితుల్లో అక్కడక్కడా ఏవో కొన్ని దేశాల్లో మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ తరచి చుాస్తే ఇది వాస్తవం కాదని అర్ధమవుతుంది. ఒకప్పటి [more]
ఆధునిక పరిస్ధితుల్లో అక్కడక్కడా ఏవో కొన్ని దేశాల్లో మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ తరచి చుాస్తే ఇది వాస్తవం కాదని అర్ధమవుతుంది. ఒకప్పటి [more]
ఆధునిక పరిస్ధితుల్లో అక్కడక్కడా ఏవో కొన్ని దేశాల్లో మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ తరచి చుాస్తే ఇది వాస్తవం కాదని అర్ధమవుతుంది. ఒకప్పటి రాజులు, చక్రవర్తుల స్ధానంలో ప్రజాస్వామ్య పాలకుల పేరుతో నయా నియంతలు పుట్టుకొస్తున్నారు. వారి చేతుల్లో ప్రజాస్వామ్యం బందీ అయిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నయా పాలకుల చేతిలో ప్రజాస్వామ్యం నలిగిపోతుంది. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అణచి వేస్తున్నారు. చట్టాలు, రాజ్యాంగాలకు వక్రభాష్యం చెబుతుా, వాటిని సవరిస్తుా తమకు అనుకుాలంగా మార్చుకుంటున్నారు. తద్వారా బతికున్నంతకాలం పీఠం మీద కుార్చోవాలని తలపోస్తున్నారు. భారత్ లోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇందుకు మినహాయింపుకాదు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు.
రాజ్యాంగ సవరణతో….
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ కోవలోకి వస్తారు. ఇరవయ్యేళ్ళుగా రష్యాను ఏలుతున్న ఈ మాజీ నిఘా విభాగం అధికారి మరో దశాబ్దానికి పైగా మాస్కో పీఠం పైన కుార్చునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఆయన అధ్యక్ష పదవీకాలం మరో నాలుగేళ్ళు అంటే 2024 వరకు ఉంది. ఇందుకోసం గతంలో రాజ్యాంగాన్ని సవరించారు రెండుసార్లు అధ్యక్షుడిగా, రెండుసార్లు ప్రధానిగా ఆయన పని చేశారు. అధ్యక్ష పదవీకాలం ఆరేళ్ళు కాగా, ప్రధాని పదవీకాలం కేవలం నాలుగేళ్ళు. అంటే వరుసగా ఏదో ఒక పదవిలో గత 20 ఏళ్ళుగా కొనసాగుతుా అధికారాన్ని గుప్పిట పట్టుకున్నారు. ఈ అధికారాన్ని మరింత పదిలం చేసుకునేందుకు ప్రస్తుతం పావులు కదుపుతున్నారు పుతిన్. 2024 తర్వాత కుాడా మరో 12 సంవత్సరాలు అధికారంలో కొనసాగేందుకు వీలుగా ఇటీవల చేసిన రాజ్యాంగ సవరణను రష్యా పార్లమెంట్ ఆమెాదించింది.
పుతిన్ కు గల పట్టుకు….
రష్యా దిగువసభ అయిన ‘ డ్యూమా ‘ (మన లోక్ సభ వంటిది) తన ఆమెాదాన్ని తెలియజేసింది. ఈ సవరణలకు అణుగుణంగా 383 ఓట్లు రాగా కనీసం ఒక్కరు కుాడా వ్యతిరేకించక పోవటం గమనార్హం. దీన్ని బట్టి రష్యాలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో అర్దమవుతుంది. 43 మంది సభ్యులు మాత్రం ఓటింగ్ కు దుారంగా ఉండటం విశేషం. దిగువ సభ ఆమెాదం పొందిన కొన్ని గంటల్లోనే ఎగువసభ ఫెడరేషన్ కౌన్సిల్ అంగీకరించడం విశేషం. రష్యా చట్టసభల్లో పుతిన్ కు గల పట్టునకు ఇంతకు మించి నిదర్శనం అక్కరలేదు. ఏప్రెల్ 22 న ఆ సవరణలపై దేశవ్యాప్తంగా ఓటింగ్ జరగనుంది. ఆలోపు రాజ్యాంగ న్యాయస్ధానం ఈ సవరణలను సమీక్షంచనుంది. 2018 మార్చి 18న జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాదించిన పుతిన్ పదవీకాలం 2024 వరకు ఉంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే 2036 వరకు పుతిన్ ఈ పదవిలో కొనసాగుతారు. తన పంతాన్ని ఆయన ఎలా అయినా నెగ్గించుకుంటారనడంలో సందేహం లేదు.
దేశాన్ని సమర్థంగా నడిపినా….
90 వ దశకంలో నాటి సోవియట్ యుానియన్ ముక్క చెక్కలవ్వడంతో దేశంలోని అతిపెద్ద ప్రాంతమైన రష్యా అధికార పగ్గాలు బోరిస్ ఎల్సిన్ కు దక్కాయి. ఎల్సిన్ వైఫల్యంతో అధికార పగ్గాలు అందుకున్న పుతిన్ క్రమంగా పట్టుపెంచుకోవడం ప్రారంభించారు. దయనీయ స్ధితిలో దేశానికి నిర్దేశం చేశారు. తనదైన వాదనలతో దేశానికి కొంతవరకు బలోపేతం చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో రష్యా పాత్రను పునర్ నిర్మించారు. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ హోదాతో లభించిన ‘వీటో ‘ అధికారాన్ని ఉపయోగించుకుంటుా దేశానికి పునర్ వైభవం తీసుకువచ్చేందుకు కృషిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా అవతరించింది. అంతర్గత పరిస్ధితులు, ఆర్ధిక పరిస్ధితులు ఎలా ఉన్నప్పటికీ దేశాన్ని పుతిన్ గాడిలో పెట్టారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయన నయా నియంతగా మారిపోతున్నారు. తనపదవిని సుస్ధిరం చేసుకుంటున్నారు. అయితే అధికారం శాశ్వతం కాదన్న చేదు నిజం ప్రస్తుతానికి ఆయనకు తెలియడంలేదు.
-ఎడిటోరియల్ డెస్క్