బాబు జాకీలేసి లేపినా సీనియర్ ఫ్యూచర్ గల్లంతేగా ?
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు.. పుట్టా సుధాకర్ యాదవ్ పరిస్థితి ఏంటి ? ఆయనకు [more]
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు.. పుట్టా సుధాకర్ యాదవ్ పరిస్థితి ఏంటి ? ఆయనకు [more]
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు.. పుట్టా సుధాకర్ యాదవ్ పరిస్థితి ఏంటి ? ఆయనకు రాజకీయంగా ఫ్యూచర్ ఉందా ? లేదా ? అన్నది గంరదగోళంగా మారింది. మైదుకూరు నియోజకవర్గంలో ఒక చిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది. ఇక్కడ 1978 నుంచి జరిగిన ఎన్నికల్లో ఇద్దరే నేతలు గెలుస్తున్నారు. ఒకరు డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ తరపున పలుమార్లు గెలిచారు. ఇక, టీడీపీ తరఫున తొలుత గెలిచి తర్వాత.. వైసీపీ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న శెట్టిపల్లి రఘురామిరెడ్డి హవా ప్రస్తుతం అక్కడ నడుస్తోంది.
పుట్టాకు ప్రాధాన్యత ఇచ్చినా…..
2014 ఎన్నికల్లో శెట్టిపల్లి రఘురామిరెడ్డి టీడీపీని వీడి వైసీపీ పంచన చేరడంతో పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీడీపీ సీటు దక్కింది. వాస్తవానికి ఈ సీటును చంద్రబాబు రెడ్డి వర్గానికి ఇవ్వాలనుకున్నా పుట్టా వియ్యంకుడు యనమల లాబీయింగ్‌కు తలొగ్గిన బాబు ఆయనకే సీటు ఇచ్చినా ఓడిపోయారు. నాడు పార్టీ అధికారంలోకి రావడంతో మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీని అడ్డం పెట్టుకుని ఏకచక్రాధిపత్యంగా ఏలేశారు. పుట్టాకు 2018 మధ్యలో చంద్రబాబు.. టీటీడీ బోర్డు చైర్మన్ గిరీ అప్పగించారు. ఆ తర్వాత గత ఏడాది ఎన్నికల్లో నూ ఆయనకు ఈ టికెట్ ఇచ్చారు. వాస్తవానికి ఆయన ఓటమిని ముందుగానే గ్రహించినా.. వియ్యంకుడు యనమల జోక్యంతో మరోసారి ఇక్కడ టికెట్ సంపాయించుకున్నారు పుట్టా సుధాకర్ యాదవ్.
తలసాని నుంచి వత్తిడి…..
చంద్రబాబు మాత్రం మాజీ మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని సీటు ఇవ్వాలని ఎంతో ప్రయత్నించినా చివరకు యనమల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఈ సారి కూడా పుట్టా సుధాకర్ యాదవ్ చిత్తుగా ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి పుట్టా పార్టీని పట్టించుకోవడం లేదు. కేడర్‌తో ఆయన సంబంధాలు పూర్తిగా దూరమయ్యాయి. మరోవైపు ఆయన మరో వియ్యంకుడు అయిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి కూడా పార్టీ మారాలన్న ఒత్తిళ్లు వస్తున్నట్టు టాక్ ? ఈ పరిణామాలు చూస్తుంటే పుట్టా రాజకీయాలు దాదాపు ముగిసినట్టేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పదవులకూ దూరంగా…..
ప్రస్తుతం కడపలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉండడం, సీఎం జగన్ దూకుడుతో.. టీడీపీ శ్రేణులు కూడా పార్టీ మారిపోవడం.. బలమైన నాయకుడిగా పుట్టా సుధాకర్ యాదవ్ ముద్ర వేసుకోలేక పోవడం.. వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక, పుట్టా రాజకీయాలను పరిశీలించిన చంద్రబాబు.. ఆయనకు పార్టీ పదవుల్లోనూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇది కూడా పుట్టా రాజకీయాలకు శరాఘాతంగా మారింది. స్థానిక టీడీపీ కేడర్ కూడా పుట్టాను నియోజక వర్గ పగ్గాల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తోంది. కేవలం యనమల ఒత్తిడితోనే ఆయన నామమాత్రంగా పార్టీలో కొనసాగుతోన్న పరిస్థితే ఉంది. పార్టీ కోసం కష్టపడాలన్న ఆకాంక్ష పుట్టా సుధాకర్ యాదవ్ కు ఎంత మాత్రం లేదని టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. కడపలో సమూల ప్రక్షాళనకు దిగుతోన్న చంద్రబాబు మైదుకూరు నుంచి పుట్టాను తప్పించే ఛాన్సులే ఉన్నాయి. దీంతో పుట్టా సుధాకర్ యాదవ్ కు రాజకీయంగా సరైన దారులు కనపడని దుస్థితి ఉంది.