పుట్టా పాలిటిక్స్‌: చివ‌రిదాకా పోరాడి?

పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌. టీడీపీలో కీల‌క నాయ‌కుడిగా అతిత‌క్కువ స‌మ‌యంలోనే ఎదిగిన నేత‌. పార్టీలో మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు, సెకండ్ రేంజ్ నేత‌గా ఉన్న య‌న‌మ‌ల [more]

Update: 2021-04-23 02:00 GMT

పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌. టీడీపీలో కీల‌క నాయ‌కుడిగా అతిత‌క్కువ స‌మ‌యంలోనే ఎదిగిన నేత‌. పార్టీలో మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు, సెకండ్ రేంజ్ నేత‌గా ఉన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు స్వయంగా వియ్యంకుడు అయిన‌.. పుట్టా.. ఇప్పటికి రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. మైదుకూరు నుంచి ఓడిపోయారు. అయినప్పటికీ.. ఆయ‌న రాజ‌కీయ హ‌వా ఏమాత్రం త‌గ్గలేదు. గ‌తంలో టీటీడీ చైర్మన్‌గా వ్యవ‌హరించారు కూడా. ఇక‌, వైసీపీ స‌ర్కారుకు మైదుకూరులో చుక్కులు చూపించారు. ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో మైదుకూరు మునిసిపాలిటీలో.. టీడీపీని గెలుపు గుర్రం వ‌ర‌కు తీసుకువెళ్లారు.

సత్తా చాటి…..

వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా ఓడిపోయినా.. కీల‌క నేత‌లు ఎవ‌రూ కూడా పార్టీని ప‌ట్టించుకున్నా.. ప‌ట్టించుకోక‌పోయినా.. రెండే రెండు జిల్లాల్లో పార్టీ దూకుడుగాముందుకు సాగింది. వాటిలో అనంత‌పురం తాడిప‌త్రి మునిసిపాలిటీ ఒక‌టి కాగా, మైదుకూరు రెండోది. తాడిప‌త్రి మునిసిపాలిటీని జేసీ వ‌ర్గం త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. మైదుకూరు విష‌యంలో మాత్రం ఆది నుంచి మంచి ప‌ట్టుతో ఉన్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ ఇక్కడ గెలిచిన కౌన్సిల‌ర్లను.. సైతం.. దూరంగా తీసుకువెళ్లి.. క్యాంపులు పెట్టి.. మునిసిపాలిటినీ ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నించారు. దీనికి గాను భారీ ఎత్తున ఖ‌ర్చు కూడా చేశార‌ని ప్రచారం జ‌రిగింది.

తిరుపతి ఉప ఎన్నికల్లో….

అయితే.. చివ‌రి నిముషంలో మాత్రం పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ చేతులు ఎత్తేశారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో.. ఓట్లు స‌హా సీపీఎం అభ్యర్థిని ఆయ‌న కాపాడుకోలేక‌పోయారు. దీంతో వైసీపీ ఇక్కడ పాగా వేసింది. దీంతో అప్పటి నుంచి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ ఎక్కడా అడ్రస్ లేకుండా పోయార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇటీవ‌ల తిరుప‌తి ఎన్నిక‌ల ప్రచారంలో క‌నిపిస్తార‌ని.. చంద్రబాబు సైతం ఆయ‌న‌కు ఆహ్వానం పంపార‌ని ప్రచారం జ‌రిగింది. కానీ, ఆయ‌న జాడ తిరుప‌తిలో క‌నిపించ‌లేదు.

ఎందుకు ముఖం చాటేశారు?

తిరుప‌తిలో యాదవ వ‌ర్గం ఓట్లు ఎక్కువుగా ఉండ‌డంతో బాబు య‌న‌మ‌ల‌, పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ను వెళ్లి ప్రచార బాధ్యత‌లు చూడ‌మ‌ని చెప్పారు. య‌న‌మ‌ల తిరుప‌తిలో మ‌కాం వేసి.. టీడీపీ శ్రేణులను ముందుకు న‌డిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయ‌న వియ్యంకుడిగా.. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ కూడా వ‌స్తార‌ని .. అనుకున్నారు. కానీ, పుట్టా ఎక్కడా క‌నిపించ‌లేదు. దీనిని బ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇక‌, ఆయ‌న జాడ క‌నిపించ‌క‌పోవ‌చ్చనే ప్రచారం మైదుకూరులో సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News