జగన్ కు ఆ ఆఫర్ కూడా ఇచ్చారా?

కోరిక ఎప్పుడూ ఊహ కాకూడదు.  కోరిక మనసులో ఉండాలి. బయటకు చెబితే అది ఖచ్చితంగా ఊహే అవుతుంది. మనసులో ఉండే మాటను పలుకుగా చెబితే జనానికి సులువుగానే [more]

Update: 2020-08-16 03:30 GMT

కోరిక ఎప్పుడూ ఊహ కాకూడదు. కోరిక మనసులో ఉండాలి. బయటకు చెబితే అది ఖచ్చితంగా ఊహే అవుతుంది. మనసులో ఉండే మాటను పలుకుగా చెబితే జనానికి సులువుగానే అర్థమవుతుంది. పాపం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు జగన్ అర్జంట్ గా జైలు కెళ్లాలని ఉంది. అయితే రాధాకృష్ణ జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ జైలుకెళితే సీఎం పదవిలో భారతిని కూర్చోబెట్టారు. బీజేపీ సహకారంతో చంద్రబాబు కూర్చుంటారని మాత్రం చెప్పలేదు. ఇది మాత్రం కొంత వారికి ఊరటనిచ్చే అంశమే అనుకోవాలి. రాసేవాడు ఉంటే చదవేవాడులోకువని.. చంద్రబాబు పార్టీని పూర్తిగా బీజేపీ కబళిస్తుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టి, పసుపు క్యాడర్ లో ధైర్యం నింపేందుకే ఈ భరోసా పలుకు అని అర్థమయిపోతుంది.

ఊహకయినా ఒక…..

ఊహకయినా ఒక అర్థముండాలి. బీజేపీ అర్జంట్ గా ఆంధ్రప్రదేశ్ లో అధకార పార్టీని కూలదోసే పరిస్థితిలో లేదు. నిన్నగాక మొన్న రాజస్థాన్ లో భంగపడిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న జగన్ ప్రభుత్వాన్ని బీజేపీ ఏరకంగా కూలదోస్తుంది? జగన్ పై వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నాడు బీజేపీ కేసులను బయటకు తీస్తుందట. అలా కేసుల్లో ఇరికించే ఏపీలో కాంగ్రెస్ ఇప్పటికీ కోలుకోలేకపోతుందన్న విషయం రాధాకృష్ణ మర్చిపోయినట్లున్నారు. అది చూసిన తర్వాత బీజేపీ ఆ సాహసం చేయగలుగుతుందా?

సోము వీర్రాజు వచ్చినప్పుడే…..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను తొలగించి సోము వీర్రాజు ను నియమించినప్పుడే హైకమాండ్ మనసు అర్ధమయింద.ి రామ్ మాధవ్ లాంటి సీనియర్ నేత సయితం ప్రతిపక్షం ఖాళీ గా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పట్లో అధికారంలోకి రాలేమని కూడా రామ్ మాధవ్ చెప్పారు. అలాంటి ఆలోచనలున్న బీజేపీ బలంగా ఉన్న జగన్ ను కాదనుకుని, తిరిగి తమను ఎదనియ్యకుండా చేసిన చంద్రబాబును దరిచేర్చుకుంటుందా? అన్నదే ప్రశ్న. రాజ్యసభలో బీజేపీకి జగన్ అవసరం మరికొన్నేళ్ల పాటు ఉంటుందన్నది తెలియదా? ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ను ఇబ్బంది పెట్టి బీజేపీ బావుకునేదేమిటి?

నేలకు దిగక పోతే…..

రాధాకృష్ణకు జగన్ ఆ కుర్చీలో నుంచి అర్జెంట్ గా దించేయాలి. జగన్ తప్ప వేరే వాళ్లు ఎవరైనా అక్కడ కూర్చోవచ్చు బీజేపీ జగన్ ను కేసుల్లో ఇరికించాలి. మళ్లీ జైలుకు పంపాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలే అని చెబుతున్నారు. ఆశకయినా ఒక హద్దుండాలి. జగన్ కు ఇంకా నాలుగేళ్ల అధికారం ఉంది. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని చెబుతున్నా గుంటూరు, విజయవాడ నుంచే వ్యతిరేకత కన్పించక పోవడం రాధాకృష్ణ బ్యాచ్ కు తెలియదా? ఈ ఊహల విశ్లేషణలు మాని నేల మీదకు దిగితే మంచిది

Tags:    

Similar News