ఆ రెబ‌ల్‌ ఎంపీగారి సీన్ రివ‌ర్స్‌.. కొంప కొలాప్సేనా ?

రాజ‌కీయాల్లో ఎంత దూకుడు ఉన్నా.. ప్రజ‌ల‌కు చేరువ‌గా ఉండాల‌నేది కీల‌క ఫార్ములా. అయితే.. దీనిని పాటించే నాయ‌కులు ప్రజ‌ల్లో ఉంటున్నారు. కాద‌నేవారు మాత్రం రాజ‌కీయాల్లో క‌నిపించ‌కుండా పోతున్నా [more]

Update: 2021-03-11 12:30 GMT

రాజ‌కీయాల్లో ఎంత దూకుడు ఉన్నా.. ప్రజ‌ల‌కు చేరువ‌గా ఉండాల‌నేది కీల‌క ఫార్ములా. అయితే.. దీనిని పాటించే నాయ‌కులు ప్రజ‌ల్లో ఉంటున్నారు. కాద‌నేవారు మాత్రం రాజ‌కీయాల్లో క‌నిపించ‌కుండా పోతున్నా రు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే.. వైసీపీ న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌ కృష్ణంరాజు కూడా ఎదుర్కొంటున్నార‌న్న చ‌ర్చే రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. నాలుగేళ్ల వ్యవ‌ధిలోనే నాలుగు పార్టీలు మారిన ఆయ‌న 2019లో వైసీపీ త‌ర‌ఫున న‌ర‌సాపురం నుంచి విజ‌యం సాధించారు. అయితే.. అనూహ్యంగా అతి స్వల్ప కాలంలోనే బీజేపీకి చేరువ‌య్యారు.

పార్టీకి యాంటీగా మారినా…?

వాస్తవానికి గతంలోనూ ర‌ఘురామ‌ కృష్ణంరాజు బీజేపీలో ఉన్నప్పటికీ.. టికెట్ ఇవ్వలేద‌నే కార‌ణంగా వైసీపీ తీర్థం పుచ్చుకుని టికెట్ సంపాయించుకున్నారు. గెలిచిన త‌ర్వాత‌.. కుటుంబ స‌మేతంగా ప్రధాని మోడీని క‌లిసివ‌చ్చారు. ఇక‌, అప్పటి నుంచి కార‌ణాలు ఏవైనా ఆయ‌న వాయిస్, ఆయ‌న వ్యవ‌హారం కూడా వైసీపీకి యాంటీగా మారిపోయింది. దీంతో ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్కరించ‌క‌పోయినా.. ఆయ‌న పార్లమెంటు స‌భ్యత్వాన్ని ర‌ద్దు చేయించేందుకు వైసీపీ నాయ‌కులు గ‌ట్టిగానే కృషి చేశారు. అయితే.. అది ఫ‌లించ‌లేదు. దీంతో పార్లమెంటులో వైసీపీ నేత‌ల‌తో కూర్చునే సీటును చివ‌రి స్థానానికి జ‌రిపి.. షాకిచ్చారు.

నియోజకవర్గానికి కూడా…?

అయినా.. కూడా ర‌ఘురామ‌ కృష్ణంరాజు త‌న పంథాను మార్చుకోలేదు. దీంతో వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌ను దూరం పెట్టారు. కొన్ని రోజులు ఆయ‌న‌కు పార్టీకి మ‌ధ్య హాట్ కామెంట్లు హ‌ల్‌చ‌ల్ చేసినా.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం.. ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ర‌ఘురామ‌ కృష్ణంరాజు దూర‌మ‌య్యారు. కొన్ని రోజులు క‌రోనా ఉంది.. ఇప్పుడు ఎలా వెళ్తాను.. అని చెప్పి ఢిల్లీకే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ క్రమంలోనే అక్క‌డే ర‌చ్చబండ నిర్వహిస్తూ నిత్యం మీడియా ముందుకు వ‌చ్చి. సొంత పార్టీపై విమ‌ర్శలు చేయ‌డం ప్రారంభించారు. అలాగే సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డ‌మే ఆయ‌న టార్గెట్‌గా పెట్టుకున్నారు.

సొంత సామాజికవర్గం కూడా….

ఇక‌, న‌ర‌సాపురం స్థానిక నేత‌లు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద‌రాజు వంటివారిపైనా తీవ్ర విమ‌ర్శలు చేశారు. మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజును కూడా వ‌దిలి పెట్టలేదు. దీంతో సొంత సామాజిక వ‌ర్గంలోనూ ర‌ఘురామ‌ కృష్ణంరాజు ఎలిమినేట్ అయ్యారు. చివ‌ర‌కు సొంత పార్టీ వాళ్లే ఆయ‌న‌పై అనేకానేక కేసులు పెడుతున్నారు. ఆయ‌న‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వై కేట‌గిరి భ‌ద్రత క‌ల్పించింది. అయినా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డానికి ఎందుకో గాని సందేహిస్తున్నారు. పోనీ.. ఆయ‌న త‌న కేడ‌ర్ అయినా నిల‌బెట్టుకున్నారా ? అంటే.. అది కూడా లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఎలానూ ర‌ఘురామ‌ కృష్ణంరాజుకు టికెట్ ఇవ్వదు.

ఏ పార్టీ నుంచి పోటీ చేసినా?

దీంతో ర‌ఘురామ‌ కృష్ణంరాజు జ‌న‌సేన నుంచో బీజేపీ నుంచో పోటీ చేయ‌క‌త‌ప్పని ప‌రిస్థితి ఏర్పడింది. ర‌ఘురామ‌ కృష్ణంరాజు బీజేపీకి ద‌గ్గర‌వుతోన్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచైనా పోటీ చేయాలంటే స్థానికంగా ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటూ కొన్ని మంచి ప‌నులు అయినా చేయాల్సి ఉంది. కానీ ఆయ‌న ఆ దిశ‌గా దృష్టే పెట్టకుండా ఎంత వ‌ర‌కు వైసీపీని టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శల రాజ‌కీయ‌మే చేస్తున్నారు. ఆయ‌న ఈ త‌ర‌హా రాజ‌కీయంతో ఏం సాధించాల‌నుకుంటున్నారో ? కూడా ఎవ్వరికి అర్థం కావ‌డం లేదు.

Tags:    

Similar News