రఘువీరా రీ ఎంట్రీ ఖాయం.. రీజనేంటి..?
రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నవ్యాంధ్ర మాజీ అధ్యక్షుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను చేపట్టిన ఆయన రెండు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అయితే.. [more]
రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నవ్యాంధ్ర మాజీ అధ్యక్షుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను చేపట్టిన ఆయన రెండు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అయితే.. [more]
రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నవ్యాంధ్ర మాజీ అధ్యక్షుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను చేపట్టిన ఆయన రెండు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అయితే.. 2014, 2019 ఎన్నికల్లో పార్టీ కనీసం ఒక్క స్థానంలోనూ విజయం దక్కించుకోకపోవడంతో ఆయన ఒకింత హర్ట్ అయ్యారు. దీంతో పార్టీ నుంచి దూరంగా ఉన్నారు. చివరకు ఈ రెండు ఎన్నికల్లోనూ ఆయన పెనుగొండ, కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించలేకపోయారు. కాంగ్రెస్‌లో ఈదడం తన వల్ల కాదనుకున్నారో ఏమో గాని పార్టీ అధ్యక్ష పదవిని స్వతంత్రంగానే వదులుకున్నారు. రాహుల్‌కు మద్దతుగా తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక, అప్పటి నుంచి రఘువీరా అనంతపురంలోని తన సొంత నియోజకవర్గంలో వ్యక్తిగత జీవనం గడుపుతున్నారు.
అవసరం వచ్చిందని….
అయితే.. ఇప్పుడు ఈయన అవసరం కాంగ్రెస్‌కు వచ్చిందని అంటున్నారు పార్టీ నేతలు. ఎందుకంటే.. ప్రస్తుతం.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అంతేకాదు.. ఎక్కడికక్కడ.. నాయకులు నిరాసక్తతతో ఉన్నారు. ఉన్నదే కొద్ది మంది అయినా.. ఉన్నవారు కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అటు ఆర్థికంగా.. ఇటు రాజకీయంగా కూడా నేతలు పుంజుకోలేక పోతున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపూ.. రఘువీరారెడ్డి వైపు చూస్తున్నారనేది వాస్తవం. అయితే.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్.. సాకే శైలజానాధ్ ఉన్నారు కదా అనే అనుమానం వస్తుంది. సాకే వల్ల పార్టీ పుంజుకోలేక పోతోందని.. సీనియర్ల వాదన. రఘువీరారెడ్డి ఉన్నప్పుడు.. అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సాకే ఫెయిలవ్వడంతో….?
అదేవిధంగా .. తన వ్యాఖ్యలతో రాజకీయాలలో వేడి పుట్టించారు. సీనియర్లతోనూ కలుపుగోలుగా ఉన్నారు. దీంతో పార్టీ పుంజుకుంటుందనే ఆశలు.. ఉండేవి. రఘువీరారెడ్డి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పాయింట్ పాయింట్ టచ్ చేస్తూ విమర్శలు చేయడంతో పాటు నిరసనలు చేస్తూ వార్తల్లో ఉండేవారు. కానీ, ఇప్పుడు సాకే శైలజానాథ్ వాయిస్ గట్టిగా వినిపించడం లేదు. పైగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలోను.. పార్టీని పుంజుకునేలా చేయడంలోను సాకే విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపూ.. మళ్లీ రఘువీరారెడ్డి అయితే.. బెటర్ అని అంటున్నారు సీనియర్లు. మరి ఆయన ఏం చేస్తారో ? అటు కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందో ? చూడాలి.