Raghu veera : ఇందులో రఘువీరా గొప్పతనం ఏముంది?

సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరరెడ్డి రాజకీయాలు మానేసి స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఆయన పూర్తిగా పల్లె వాతావరణానికి అలవాటు పడ్డారు. సేద్యం, పశువుల పెంపకంతో రఘువీరారెడ్డి కాలక్షేపం [more]

Update: 2021-10-30 11:00 GMT

సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరరెడ్డి రాజకీయాలు మానేసి స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఆయన పూర్తిగా పల్లె వాతావరణానికి అలవాటు పడ్డారు. సేద్యం, పశువుల పెంపకంతో రఘువీరారెడ్డి కాలక్షేపం చేస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలోనే ఆయన నివాసం ఉంటున్నారు. కుమార్తె, కుమారులకు తన వ్యాపారాలను అప్పగించేసి పూర్తిగా పల్లె గాలిని పీల్చుకుంటున్నారు.

ఆయనకు అన్నీ అలవాటే….

అయితే ఇందులో రఘువీరారెడ్డి గొప్పతనం ఏమీ లేదంటున్నారు. రఘువీరా దశాబ్దాల కాలాల పాటు రాజకీయాలు చేశారు. మంత్రిగా పనిచేశారు. పల్లె వాసనలు ఆయనకు కొత్తేమీ కాదు. అలాగే ఎండా, వానలు కూడా ఆయనను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి. అన్నీ వదిలేసి తన సొంతగ్రామమైన నీలకంఠాపురం ఉంటున్నారు. ఆయన పెద్దగా ఇబ్బంది పడరు. కానీ ఆయన భార్య సునీతను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.

కష్టాలు తెలియని….

ఉన్నత కుటుంబంలో జన్మించిన సునీత రఘువీరారెడ్డితో కలసి మూడు దశాబ్దాలకు పైగానే ప్రయాణం చేశారు. రాజకీయ నాయకుడు కావడంతో ఎక్కువ కాలం సునీత హైదరాబాద్ లోనే ఉన్నారు. ఏసీ గదులు, విలాసవంతమైన జీవితాన్ని సునీత గడిపారు. కుమార్తె, కుమారుడు కూడా ఎదగడం, వ్యాపారాల్లో స్థిరపడటంతో ఆమెకు కష్టమనేది తెలియదు. ఇప్పుడు సునీత నీలకంఠాపురంలో సాధారణ జీవితాన్ని గడుపుతున్న తీరు అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది.

భర్తకు చేదోడు వాదోడుగా….

రఘువీరారెడ్డి కి తెలిసిన కష్టాలు సునీతకు తెలియవు. అయినా ఆమె కొన్నేళ్లుగా నీలకంఠాపురంలోనే ఉంటూ ఆయనకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఏసీ కార్లలో తిరిగిన సునీత ఇప్పుడు చిన్న మోపెడ్ లో ప్రయాణించడం ఆమె సామాన్య జీవితానికి అద్దంపడుతుంది. మొత్తం మీద రఘువీరారెడ్డి అన్నీ వదిలేసి వ్యవసాయంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నా, భర్త వెంటే నడుస్తూ అండగా ఉన్న సునీతను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.

Tags:    

Similar News