ఆ ఒక్క కార‌ణంతోనే ఈ ఎంపీ అలా చేస్తున్నారా?

ఆయ‌న తొలిసారి ఎంపీగా విజ‌యం సాధించి.. పార్లమెంటులో అడుగుపెట్టారు. కీల‌క‌మైన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ స్థానం నుంచి విజ‌యం సాధించారు. ఆయ‌నే క‌నుమూరి ర‌ఘురామ [more]

Update: 2020-06-10 14:30 GMT

ఆయ‌న తొలిసారి ఎంపీగా విజ‌యం సాధించి.. పార్లమెంటులో అడుగుపెట్టారు. కీల‌క‌మైన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ స్థానం నుంచి విజ‌యం సాధించారు. ఆయ‌నే క‌నుమూరి ర‌ఘురామ కృష్ణంరాజు. ఆయ‌న రాజ‌కీయాలే చిత్రంగా ఉంటాయి. కేవీపీ రామ‌చంద్రరావుకు స్వయానా వియ్యంకుడు ఆయ‌న కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చారు. అక్కడ జ‌గ‌న్‌తో స‌రిప‌డ‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో ఆయ‌న రాజ‌కీయం ప్రారంభించారు. అక్కడా పొస‌గ‌లేదు. దీంతో గ‌తేడాది ఎన్నిక‌ల ముందు వైసీపీలోకి వ‌చ్చారు. ఇక్కడ గెలవ‌డ‌మైతే.. గెలిచారు త‌ప్ప.. నేత‌ల‌తోను.. పార్టీతోనూ ఆయ‌న దూరంగానే ఉంటున్నారు. అంతేకాదు.. ఏదైతే.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏది న‌చ్చదో అదే చేస్తున్నా రు. అన్నింటిలోనూ తానే గొప్ప.. అనే ధోర‌ణిని ఆయ‌న ప్రద‌ర్శిస్తున్నారు.

మంచి వారేనంటూ….

నిజానికి పార్టీలో ఏదైనా స‌హించే జ‌గ‌న్‌.. నేను గ్రేట్ అనే మాట‌ను మాత్రం అస్సలు స‌హించ‌రు. అలాంటిది ర‌ఘురామ కృష్ణంరాజు మాత్రం త‌న‌ను తాను పెద్దోణ్ని చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయ‌త్నించారు. గెలిచీ గెల‌వ‌డంతోనే ఆయ‌న కుటుంబ స‌మేతంగా ఢిల్లీ వెళ్లి.. ప్రధాని న‌రేంద్ర మోడీని క‌లిసి వ‌చ్చారు. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టించుకుని ప్రచారం చేసుకున్నారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ తెలుగు మీడియాన్ని తీసే స్తామ‌ని ప్రక‌టించ‌గానే పార్లమెంటులో చ‌ర్చ‌కు పెట్టారు. ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక విష‌యాన్ని కూడా రాజ‌కీయం చేస్తున్నారు. జ‌గ‌న్ మంచివారే.. అంటూనే పాల‌న‌పై బుర‌ద జ‌ల్లుతున్నారు.

వ్యాపారాలుండటంతో….

ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వ్యవ‌హారాన్ని ప‌రిశీలిస్తున్న కొంద‌రు విశ్లేష‌కులు అస‌లు ఏంజ‌రిగింది? ఎందుకు ఇలా ఎంపీ వ్యవ‌హ‌రిస్తున్నారు? అనే కోణంలో ప‌రిశీలించారు. ఈ క్రమంలోనే వారికి కొత్త విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. తాను వైసీపీలోనే ఉంటార‌నేది ఈ విష‌యం స్పష్టం. అయితే, త‌న వ్యాపారాల రీత్యా.. వ్యవ‌హారాల రీత్యా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో త‌న‌కు చాలా ప‌నులు ఉన్నాయి. వాస్తవానికి కేంద్రంలో స‌రైన మెజారిటీ రాక‌పోతే.. జ‌గ‌న్ బీజేపీకి మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం ఉండి ఉంటే.. తానే చ‌క్రం తిప్పాల‌ని ర‌ఘురామ కృష్ణంరాజు భావించిన‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు గ‌తంలోనే చెప్పిన విష‌యాన్ని ఇప్పుడు వారు తెర‌మీదికి తెచ్చారు.

వైసీపీలోనే ఉంటూ….

మొత్తంగా ర‌ఘురామ కృష్ణంరాజు వైఖ‌రి చూస్తే.. క‌ర్ర విర‌గ కుండా.. పాము చావ‌కుండా.. తాను వైసీపీలోనే ఉంటూ.. బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు వ్యవ‌హ‌రిస్తూ.. త‌న ప‌నులు చ‌క్కబెట్టు కునేందుకు ఇలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని కొంద‌రు ప్రచారం చేస్తున్నారు. మ‌రి మున్ముందు ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఏదేమైనా.. వ్యాపార సామ్రాజ్యాల నుంచి వ‌చ్చిన వారు ఇలానే ఆలోచిస్తార‌న‌డానికి ఇంత‌క‌న్నా.. రుజువు ఏం కావాలి? అనేది కూడా కీల‌క ప్రశ్నగానే ఉంది.

Tags:    

Similar News