నీకు ఇక ఎవరు టిక్కెట్ ఇస్తారు సామీ?
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, రెబల్ ఎంపీ.. కనుమూరి రఘురామకృష్ణంరాజు పార్టీలోనే ఉంటూ.. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు [more]
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, రెబల్ ఎంపీ.. కనుమూరి రఘురామకృష్ణంరాజు పార్టీలోనే ఉంటూ.. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు [more]
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, రెబల్ ఎంపీ.. కనుమూరి రఘురామకృష్ణంరాజు పార్టీలోనే ఉంటూ.. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్‌ను అనుకరించడం.. ఆయన వాయిస్‌ను మిమిక్రీ చేసి.. వ్యంగ్యాస్త్రాలు సంధించడం.. వంటివి కామన్ అయ్యాయి. ప్రతి రోజూ రచ్చబండలో రఘురామకృష్ణంరాజు వైసీపీ కీలక నేతలను, ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలను చాకిరేవు పెట్టేస్తున్నారు. ఎవరూ వీటిని హర్షించలేక పోతున్నా.. రఘురామకృష్ణంరాజు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే.. ఆయన పార్టీ నుంచి రిజైన్ చేసి.. బయటకు వచ్చి.. విమర్శలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
రిజైన్ చేయకుండానే?
అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం.. రిజైన్ అన్నమాటే వినిపించుకోవడం లేదు. ఇక వైసీపీకి, రఘురామకృష్ణంరాజుకు సంబంధాలు తిరిగి కొనసాగుతున్నాయన్న వాతావరణం కూడా లేదు. ఇక, ఇలాంటి నాయకుడికి వచ్చే ఎన్నికల్లో ఎవరు టికెట్ ఇస్తారు ? అనేది ప్రశ్న. మేధావికి టికెట్ ఇస్తారు కానీ.. మహామేధావిగా వ్యవహరించేవారికి మాత్రం ఎవరు టికెట్ ఇస్తారు ? అనేది కీలకం. నిజానికి బీజేపీతోను, ఇటు టీడీపీతోనూ టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే 2024 ఎన్నికల కోసం.. టీడీపీని-బీజేపీని కలిపే బాధ్యత తీసుకుంటున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తరచుగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆయన మిలాఖత్ అయ్యేది కూడా అందుకేనని తెలుస్తోంది.
ఈ రెండింటిలో…?
ఈ క్రమంలో టీడీపీ నుంచి కానీ,, బీజేపీ నుంచి కానీ, రఘురామకృష్ణంరాజు పోటీ చేయొచ్చని తెలుస్తోంది. ఇందులోనూ బీజేపీ-టీడీపీ కలిసిపోతే.. బీజేపీకే నరసాపురం నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశం ఉందని..సో.. అప్పుడు బీజేపీ నుంచి రాజు గారు పోటీ చేయొచ్చని అంటున్నారు. కానీ, ఇటు.. బీజేపీలో ఉన్న కొందరు.. జగన్‌ను సమర్దిస్తున్నారు. దీనికి కారణం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, చాలా మంది సీఎంలు ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కారును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఒక్కరే సమర్ధించారు.
బీజేపీ ఇవ్వకపోతే?
మోడీని ఎవరూ కామెంట్లు చేయొద్దని.. దేశ ఐక్యతకు ఆయన కృషి చేస్తున్నారని.. వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. సో.. ఇలాంటి ఈక్వేషన్లు ఉన్న నేపథ్యంలో వైసీపీని వ్యతిరేకించే రఘురామకృష్ణంరాజుకు బీజేపీ ఛాన్స్ ఇస్తుందా? అనేది కూడా సందేహం. రఘురామ కృష్ణంరాజు గతంలో బీజేపీలోనూ, టీడీపీలోనూ కీలకంగానే ఉన్నారు. అయితే ఈ రెండు ఈక్వేషన్లు సెట్ కాకపోతే రఘురామకృష్ణంరాజు ఇండిపెండెంట్‌గానే బరిలో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.