రచ్చబండ  గుదిబండ అయింది ఇలా….?

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు తనంతట తానే కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఒక ఎంపీ ఎలా వ్యవహరించకూడదో ఆయన గత కొన్నాళ్లుగా అలా వ్యవహరించారు. వైసీపీలో ఉన్న [more]

Update: 2021-05-15 05:00 GMT

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు తనంతట తానే కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఒక ఎంపీ ఎలా వ్యవహరించకూడదో ఆయన గత కొన్నాళ్లుగా అలా వ్యవహరించారు. వైసీపీలో ఉన్న 22 మంది పార్లమెంటుసభ్యుల్లో రఘురామకృష్ణంరాజు ఒకరు. ఆయనకంటూ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం తొలి నుంచి తనకు ప్రయారిటీ కావాలని ఆశించారు. అదే ఆయనకు ఇబ్బందిగా మారింది.

జగన్ ను….

సమావేశాల్లో జగన్ ను చిన్న వయసువాడిగా చూడటం, ఏక వచనంతో సంభోదించడం వంటివి రఘురామకృష్ణంరాజుకు చేటు తెచ్చాయంటున్నారు. ఇదే జగన్ కు, ఆయనకు మధ్య గ్యాప్ పెంచింది. ఇక వరసగా వైసీపీ అధినాయకత్వం ఆదేశాలకు విరుద్ధంగా బీజేపీ పెద్దలను కలవడం కూడా రఘురామకృష్ణంరాజుకు ఇబ్బందికరంగా మారింది. అప్పటి నుంచే వైసీపీ ఆయనను కొంత దూరం పెడుతున్నట్లు అనిపించింది.

తానే పెద్ద నేతగా..?

అప్పటికీ రఘురామకృష్ణంరాజు గమనించలేదు. తనను తాను పెద్ద నాయకుడిగా ఫీలయిపోయారు. ఫలితంగా ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు స్పీకర్ కు పిటీషన్ వేశారు. ఇక అప్పటి నుంచి రచ్చ బండ పేరుతో రఘురామకృష్ణంరాజు రోజూ యాగీ యాగీ చేస్తున్నారు. తొలినాళ్లలో జగన్ కు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ రానురాను పార్టీ అధినేతపైనే విమర్శలు ప్రారంభించారు. పార్టీ పేరుపైన కూడా ఆయన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

ఆశ్చర్యం లేకపోయినా?

ఇటీవల గత కొద్దిరోజులుగా రఘురామకృష్ణంరాజు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. జగన్ తో పాటు ఆయన సామాజికవర్గంపైన కూడా దాడిని మొదలుపెట్టారు. దీనికి తోడు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్ కు ఆగ్రహం తెప్పించకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎంపీగా, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వాడినని మర్చిపోయి రఘురామకృష్ణంరాజు దిగజారి వ్యవహరించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన రచ్చబండ కబుర్లు విన్నవారికి ఎవరికైనా ఆయన అరెస్ట్ పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.

Tags:    

Similar News