రాజుగారి అరెస్ట్ జగన్ కు ఇబ్బందవుతుందా?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ జగన్ కు ఇబ్బందికరంగా మారనుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ తో జగన్ తాత్కాలికంగా ఆనందం పొందవచ్చేమో కాని [more]

Update: 2021-05-15 06:30 GMT

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ జగన్ కు ఇబ్బందికరంగా మారనుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ తో జగన్ తాత్కాలికంగా ఆనందం పొందవచ్చేమో కాని రానున్న కాలంలో న్యాయస్థానాల పరంగా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. రఘురామ కృష్ణంరాజు ను అరెస్ట్ చేయించి జగన్ తనంతట తానే ఇబ్బందులు కొని తెచ్చుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బెయిల్ రద్దు కోరుతూ…..

రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ ను రద్దు చేయాాలని కోరుతూ పిటీషన్ వేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండటంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తన బెయిల్ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే తన బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ వేసిన రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ చేయడంతో న్యాయపరంగా సీబీఐ కోర్టులో జగన్ కు చిక్కులు తప్పవని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.

సీబీఐ కోర్టులో…..

రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ తాత్కాలికమే. ఆయన బెయిల్ పై బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు ప్రత్యేకంగా పోయేదేమీ లేదు. బయటకు వచ్చిన తర్వాత రఘురామ కృష్ణంరాజు మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఇక రోజు వైసీపీ నేతలు ఆయనకు కౌంటర్లు ఇవ్వాల్సి ఉంది. కానీ జగన్ కు మాత్రం అలా కాదు. తాను బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ వేసినందునే తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని రేపు సీబీఐ కోర్టులో రఘురామ కృష్ణంరాజు వాదించే అవకాశముంది.

ఇదే ఉదాహరణ అంటూ….

సాక్షులను, తన ప్రత్యర్థులను జగన్ ప్రభావితం చేయడం, బెదిరించడం వంటి వాటికి రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ఉదాహరణ అంటూ ఆయన న్యాయవాదులు వాదించవచ్చు. ఇది న్యాయపరంగా జగన్ కు ఇబ్బందులేనంటున్నారు. బెయిల్ పిటీషన్ రద్దు చేసిన వారిపైనే కేసులు నమోదు చేస్తే ఇక సాక్షులను జగన్ ఎందుకు ప్రభావం చేయరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. అందుకే న్యాయనిపుణులు మాత్రం రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ఆయన కన్నా జగన్ కు ఇబ్బందులు తెచ్చి పెడతాయంటున్నారు.

Tags:    

Similar News