మనసు మార్చుకున్న రాజుగారు..రీజన్ ఇదేనట
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు దారి దొరికింది. ఆయన తనకు అండగా నిలిచిన టీడీపీ వైపు వెళ్లాలని యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు దారి దొరికింది. ఆయన తనకు అండగా నిలిచిన టీడీపీ వైపు వెళ్లాలని యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు దారి దొరికింది. ఆయన తనకు అండగా నిలిచిన టీడీపీ వైపు వెళ్లాలని యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి తానేంటో చూపిస్తానని సన్నిహితుల వద్ద రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అప్పటివరకూ వైసీపీలోనే ఉండి ఆ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలే నిర్వహించాలన్నది రఘురామకృష్ణంరాజు ఆలోచనగా ఉంది. తనను అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఆయన రానున్న కాలంలో మరింత రెచ్చిపోతున్నారని తెలిసింది.
బీజేపీతో ఉందామనుకున్నా….?
రఘురామకృష్ణంరాజు ఇప్పటివరకూ బీజేపీకి ఒకింత మద్దతుగా ఉన్నారు ఆయన ఆలోచన కూడా బీజేపీ వైపే ఉంది. బీజేపీ అయితే తన వ్యాపారాలకు కూడా ఇబ్బంది ఉండదని భావించారు. తనపై నమోదయిన సీబీఐ కేసులతో బీజేపీతో ఉంటేనే మేలని రఘురామ కృష్ణంరాజు అనుకున్నారు. అందుకే ఆయన ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో టచ్ లో ఉంటూ వచ్చారు. తనకు ప్రాణహాని ఉంది వై కేటగిరి భద్రతను తెప్పించుకున్నారు.
న్యాయపరమైన సహకారం…
కానీ ఇటీవల తనను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ స్పందించిన తీరుపట్ల రఘురామకృష్ణంరాజు ఫిదా అయ్యారని తెలిసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కిందిస్థాయి నేతల వరకూ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ను ఖండించారు. ఆయనకు న్యాయవాదులను వెంటనే సమకూర్చి పెట్టింది కూడా టీడీపీయే నంటారు. ఆయనకు న్యాయపరంగా అన్ని రకాల సహాయ సహకారాలను టీడీపీ అందించింది.
బీజేపీ పెద్దగా?
ఇదే సమయంలో బీజేపీ మాత్రం రఘురామకృష్ణంరాజు అరెస్ట్ పై పెద్దగా స్పందించలేదు. ఒక్క టీడీపీయే తన వెంట నిలిచిందని రఘురామకృష్ణంరాజు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో ఆయన టీడీపీలోనే తన రాజకీయ భవిష్యత్ ను చూసుకోవాలని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. జగన్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి చెక్ పెట్టాలంటే తానే టీడీపీ నుంచి బరిలోకి దిగాలని రఘురామకృష్ణంరాజు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకూ వెనక నుంచి టీడీపీ మద్దతుదారుగా ఉన్న రఘురామకృష్ణంరాజు రానున్న కాలంలో పార్టీ సభ్యుడిగా మారే అవకాశముంది.