ఈటల పాటి దమ్ము, ధైర్యం లేదా రాజుగారూ?

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రెండు రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రజలు గమనిస్తుంటారు. రాజకీయ పరిస్థితులను, పరిణామాలను బేరీజు వేసుకుంటారు. ఏపీ, తెలంగాణలో ఒకే విధమైన రాజకీయ పరిణామాలు [more]

Update: 2021-06-05 06:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రెండు రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రజలు గమనిస్తుంటారు. రాజకీయ పరిస్థితులను, పరిణామాలను బేరీజు వేసుకుంటారు. ఏపీ, తెలంగాణలో ఒకే విధమైన రాజకీయ పరిణామాలు సంభవించినప్పుడు మరింత ఆసక్తి నెలకొంటుంది. తెలంగాణలో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆయన తన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ పదవికి కూడా రాజీనామా చేశారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పరిస్థిితి కూడా ఇందుకు భిన్నం కాదు.

ఈటల రాజీనామాతో…?

ఈటల రాజేందర్ కు, కేసీఆర్ కు మధ్య గ్యాప్ రావడంతో ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు. దీంతో ఈటల రాజేందర్ తన కు కేసీఆర్ ఇచ్చిన బీపారం అవసరం లేదని ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ అదే సమయంలో రఘురామ కృష్ణంరాజుది కూడా అదే పరిస్థితి. దాదాపు ఏడాది కాలం పై నుంచి రఘురామ కృష్ణంరాజుకు, పార్టీ అధినేత జగన్ కు మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే

అనర్హత వేటు వేయాలని…?

దీనిపై వైసీపీ ఎంపీలు రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కూడా. అయితే దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకరకంగా రఘురామ కృష్ణంరాజును వైసీపీ నేతలు సోషల్ బాయ్ కాట్ చేశారు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయారు. జగన్ బెయిల్ పిటీషన్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తరచూ పార్టీ అధినేత, ఆయన తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తూ రఘురామ కృష్ణంరాజు చికాకు పుట్టించారు. దీంతో ఆయనపై ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈటల తరహాలోనే?

కానీ రఘురామ కృష్ణంరాజుకు నిజంగా వ్యక్తిగత ఇమేజ్ ఉంటే ఈటల రాజేందర్ తరహాలో రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ విన్పిస్తుంది. పార్టీ అధినేత పక్కన పెట్టినా ఇంకా బీఫారం ఇచ్చిన పార్టీలో కొనసాగడమేంటని ప్రశ్నలు విన్పిస్తున్నాయి. వైసీపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీ అధినేత పై విమర్శలు చేయడం, కేసులు వేయడమేంటన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రఘురామ కృష్ణంరాజుకు ధైర్యం ఉంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేయాలని డిమాండ్లు విన్పిస్తున్నాయి. ఇప్పడు సోషల్ మీడియాలో ఈ అంశం ఒకటే వైరల్ అవుతుంది.

Tags:    

Similar News