హీరోను చేయాలని తెగ ఆరాటం…ఉబలాటం

ఇప్పుడు విపక్షాలకు, వారికి మద్దతిచ్చే మీడియాకు రఘురామ కృష్ణంరాజు ఒక హీరోగా దొరికారు. ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఇప్పుడు మీడియా ఒకటే పొగుడుతుంది. రఘురామ కృష్ణంరాజు [more]

Update: 2021-06-08 02:00 GMT

ఇప్పుడు విపక్షాలకు, వారికి మద్దతిచ్చే మీడియాకు రఘురామ కృష్ణంరాజు ఒక హీరోగా దొరికారు. ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఇప్పుడు మీడియా ఒకటే పొగుడుతుంది. రఘురామ కృష్ణంరాజు అంతటి నేత లేడని ఆకాశానికెత్తేస్తుంది. చంద్రబాబును మించి రఘురామ కృష్ణంరాజుపై ప్రశంసలు కురిపిస్తుంది. ఇంతకీ రఘురామ కృష్ణంరాజు ఏం చేశారు? ఆయన ఎప్పుడైనా ప్రత్యక్ష్య రాజకీయాల్లో విజయం సాధించారా?

తొలిసారి గెలిచి….

రఘురామ కృష్ణంరాజు 2014 ఎన్నికల్లోనే పోటీ చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. తొలిసారి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 25 పార్లమెంటు స్థానాల్లో 22 ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఆ 22 మంది ఎంపీల్లో రఘురామ కృష్ణంరాజు ఒకరు అంతే. ఆయనకు అంతకు మించి ప్రాధాన్యత లేదు.

జగన్ ను థిక్కరించడమే…?

కానీ వైసీపీ గుర్తు మీద గెలిచిన రఘురామ కృష్ణంరాజు పార్టీనే థిక్కరించడం, అధినేతపైనే విమర్శలు చేయడం, జగన్ బెయిల్ పిటీషన్ ను రద్దు చేయాలని పిటీషన్లు వేయడం వంటివి విపక్షాలకు, వాటి అనుకూల మీడియా మద్దతు దొరికింది. దీంతో రఘురామ కృష్ణంరాజు మరింత రెచ్చిపోతున్నారు. గతంలో సోనియాను ఎదిరించిన జగన్ కు ప్రజలు ఏపీలో అండగా నిలిచారు. అదే మాదిరిగా జగన్ ను ఎదిరించిన హీరో రఘురామ కృష్ణంరాజు అంటూ ప్రొజెక్ట్ చేయడానికి విపక్షాలు, మీడియా తెగ తంటాలు పడుతున్నాయి.

అంతటి శక్తి సామర్థ్యాలుంటే?

రఘురామ కృష్ణంరాజు తొలి సారి ఎంపీ అయిన విషయాన్ని మర్చిపోతున్నారు. ఆయన గతంలోనూ అనేక పార్టీలు మారినా ఎక్కడా నిలకడలేని మనస్తత్వం ఆయనది. తెలుగుదేశం పార్టీలోనూ చేరి తిరిగి రఘురామ కృష్ణంరాజు వైసీపీలోకి వచ్చిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. నిజంగా ఆయనకు అంతటి శక్తి సామర్థ్యాలే ఉంటే, జగన్ కంటే అన్నింటా సమర్థుడైతే రాజీనామా చేసి తిరిగి గెలవాలన్న డిమాండ్ వినపడుతుంది. మొత్తం మీద రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు విపక్షాలకు హీరో అయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరోనా? జీరోనా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

Tags:    

Similar News