నేనింతే నంటున్నాడు .. ఇక రాజకీయ సమాధి తప్పదా?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కవ్విస్తూనే ఉన్నారు. రెచ్చగొడుతూనే ఉన్నారు. నిత్యం జగన్ కు నేరుగా లేఖలు రాస్తూ ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. జగన్ ఇచ్చిన [more]

Update: 2021-07-09 12:30 GMT

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కవ్విస్తూనే ఉన్నారు. రెచ్చగొడుతూనే ఉన్నారు. నిత్యం జగన్ కు నేరుగా లేఖలు రాస్తూ ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ రఘురామ కృష్ణంరాజు లేఖలు రాస్తుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటీవల రాజద్రోహం కేసు కింద రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ తర్వాత ఆయన దూకుడు తగ్గుతుందని అందరూ భావించారు.

లేఖల పేరుతో?

కానీ గతంలో రచ్చ బండ పేరుతో రోజూ మీడియా సమావేశాలు పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ ను విమర్శించే రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు లేఖల పేరుతో ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. ఇంత జరిగినా రెచ్చగొట్టడం ఎందుకు రాజుగారూ అంటే నేనింతే అని అంటున్నారు. ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ అన్ని పార్టీల ఎంపీలకు లేఖలు రాసి జగన్ పార్టీని జాతీయ స్థాయిలో బద్నాం చేయాలని చూశారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

కసి మరింత పెరిగి….

నిజానికి రఘురామ కృష్ణంరాజును చూస్తుంటే ఆయనలో కసి మరింత పెరిగినట్లు కన్పిస్తుంది. ఒక రాజకీయ నేతకు ఇది పనికిరాదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఆయనకు సమీప బంధువు, సీనియర్ రాజకీయ నేత కూడా కొంచెం తగ్గమని సూచించినా రఘురామ కృష్ణంరాజు ఏమాత్రం కేర్ చేయడం లేదు. ఇది రాజీకీయంగా భవిష్యత్ లో నష్టమని పలువురు సూచిస్తున్నా ఆయన వినడం లేదు.

ఆగ్రహం ఉంటే?

రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ మీద, ఆ పార్టీ అధినేత జగన్ మీద చిరాకు, ఆగ్రహం ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. అనేక మంది రాజకీయ నేతలు అదే చేస్తారు. కానీ ఎంపీ పదవి ఊడిపోతుందేమోనని, ఉప ఎన్నిక జరిగితే గెలవలేమోనన్న భయంతోనే రఘురామ కృష్ణంరాజు పదవికి రాజీనామా చేయడం లేదంటున్నారు. అంతేకాకుండా టీడీపీకి చేరువయ్యేందుకు నిత్యం జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం రఘురామ కృష్ణంరాజు చేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. మొత్తం మీద రఘురామ కృష్ణంరాజు రాజకీయంంగా తనను తాను సమాధి చేసుకునేందుకే డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది.

Tags:    

Similar News