రఘురామ హీరో…. అంతేగా…అంతేగా…?

హీరో ఒకరు ఎలా అవుతారు. బలవంతుడి మీద యుద్ధం చేసి విజయం సాధిస్తే హీరో అయిపోతారు. సరిగ్గా పన్నెండేళ్ళ క్రితం జగన్ అనే యువ ఎంపీ సోనియా [more]

Update: 2021-07-25 14:30 GMT

హీరో ఒకరు ఎలా అవుతారు. బలవంతుడి మీద యుద్ధం చేసి విజయం సాధిస్తే హీరో అయిపోతారు. సరిగ్గా పన్నెండేళ్ళ క్రితం జగన్ అనే యువ ఎంపీ సోనియా గాంధీ అనే మేరునగాన్ని ఢీ కొట్టి ఉమ్మడి ఏపీలో హీరోగా మారిపోయాడు. ఇపుడు అదే ప్రాక్టీస్ ని రెబెల్ ఎంపీ రఘురామ‌కృష్ణరాజు చేస్తున్నారు. నాడు సోనియా గాంధీ తన అహంకారంతో జగన్ కి బ్రహ్మాండమైన అవకాశం ఇస్తే నేడు జగన్ రఘురామ‌కృష్ణరాజుకు కూడా అదే వరాన్ని ప్రసాదించారన్న మాట.

ప్రక్రియ చాలా…?

తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ రఘురామ‌కృష్ణరాజు అనర్హత పిటిషన్ మీద చర్య అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుందని, రెండు వైపులా వాదనలు వినాలని మీడియా ఎదుట‌ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అంటే ఎంపీ అనర్హత అంటూ ఒక పిటిషన్ ఇచ్చేసి అర్జంటుగా వేటేసేయండి అంటే అసలు కుదిరే వ్యవహారం కాదని ఓం బిర్లా తేల్చి చెప్పేసారు అన్న మాట. సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందంటూ స్పీకర్ అనడం బట్టి చూస్తే వైసీపీ ఎంపీలు సభను స్టాల్ చేస్తామనడాన్ని లైట్ గానే తీసుకున్నారు అనిపిస్తుంది.

విజేతగా..?

జగన్ తో విభేదించిన మొదట్లో ఎపుడో ఒకపుడు ఒకటి రెండు మాటలు అంటూ ఉండే రఘురామ‌కృష్ణరాజును ఇంతటి స్థాయికి తెచ్చిన ఘనత‌ అచ్చంగా జగన్ దే అని చెప్పాలి. ఆయన్ని పట్టించుకుంటే దగ్గరకు తీయాలి. వదిలేస్తే పూర్తిగా మరచిపోవాలి. ఇక జగన్ చేతిలో ఉన్న ఆయుధం ఏంటి అంటే ఒక్క దెబ్బకు స‌స్పెండ్ చేయడం. ఆ పని చేస్తే రఘురామ‌కృష్ణరాజు ఎంపీగా కొనసాగుతారు అన్న బాధతో స్పీకర్ మీదకు దాన్ని నెట్టారు. అక్కడ యాక్షన్ లేక రఘురామ‌కృష్ణరాజు రియాక్షన్ చూసిన మీదట ఓడిందెవరో వైసీపీ పెద్దలకు ఈపాటికే అర్ధం కావాలిగా.

బాబు కంటే ..?

ఏపీలో అసలైన ప్రతిపక్షం అంటే రఘురామ‌కృష్ణరాజు అనే చెప్పాలేమో. ఆయన ఇమేజ్ అమాంతం అలా పెరిగిపోయింది. జగన్ కి ఈక్వల్ గా ఆయన ఎదిగిపోయారు. అత్యంత ప్రజాదరణ కలిగిన జగన్ ఎక్కడ, ఆయన టికెట్ ఇస్తే గెలిచిన రఘురామ‌కృష్ణరాజు ఎక్కడ. కానీ తన పక్కనే రాజుకు చోటు అంటూ జగనే సీటు ఇచ్చారు. ఇక ఏపీ రాజకీయాల్లో రఘురాముడు పొలిటికల్ గా బాగా ఫోకస్ అవుతున్నారు. ఆయన్ని అంతలా ఎదిగేలా చేసిన జగన్ కి మనసులో అయినా థాంక్స్ చెప్పుకుంటాడేమో. ఏది ఏమైనా రఘురామ‌కృష్ణరాజు వేసిన ట్రాప్ లో జగన్ ఇరుక్కుని ఇపుడూ ఎటూ వెళ్ళలేక చిక్కుపడిపోయారుగా అన్నదే రాజకీయం తెలిసిన వారంతా అనే మాట.

Tags:    

Similar News