ys jagan : జగన్ ను వదలడట.. రాజీనామా చేయడట

జగన్ జైలు కెళితే ముఖ్యమంత్రి ఎవరు? భారతిని ఇప్పుటి నుంచే ట్రైయిన్ చేస్తున్నారా? విజయమ్మ షర్మిల సీఎం కావాలని కోరుకుంటుందా? గత కొద్ది రోజులుగా ఒకవర్గం మీడియాలో [more]

Update: 2021-09-15 13:30 GMT

జగన్ జైలు కెళితే ముఖ్యమంత్రి ఎవరు? భారతిని ఇప్పుటి నుంచే ట్రైయిన్ చేస్తున్నారా? విజయమ్మ షర్మిల సీఎం కావాలని కోరుకుంటుందా? గత కొద్ది రోజులుగా ఒకవర్గం మీడియాలో వస్తున్న కథనాలు. సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దయితే ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై ఊహాగానాలను వండి వార్చారు. చివరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో ఒక గ్రూపు పెట్టి ముఖ్యమంత్రి కాబోతున్నట్లు కూడా కథనాలను పెట్టారు.

స్పష్టమైన తీర్పుతో….

అయితే ఈరోజు సీబీఐ కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటీషన్ ను కొట్టేసింది. దీంతో ఇన్నాళ్లూ జగన్ జైలు కెళతారని భావించిన నోళ్లు మూతపడ్డాయి. అయితే రఘురామ కృష్ణరాజు తాను వదలి పెట్టే ప్రసక్తి లేదంటున్నాడు. తాను తొలుత హైకోర్టుకు వెళతానని, అక్కడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని రఘురామ కృష్ణరాజు చెబుతున్నారు.

నిన్ననే హైకోర్టులో….

అసలు రఘురామ కృష్ణరాజుకు నిన్ననే అనుమానం వచ్చింది. ఆయన సీబీఐ కోర్టు తీర్పు వెలువరించడానికి కొన్ని గంటల ముందు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంమైంది. అయితే ఆ పిటీషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ తో పాటు విజయసాయిరెడ్డి పిటీషన్ ను కూడా విచారిస్తామని చెప్పడంతో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని రఘురామ కృష్ణరాజు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తీర్పు రిజర్వ్ చేసిన రోజు కూడా అదే చెప్పారు.

రాజీనామా చేయాలని…

కాని తీర్పుకు ఒకరోజు ముందు రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. రఘురామ కృష్ణరాజు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళతానంటున్నారు. ఆయనకు ఆ అవకాశముంది. వెళ్లొచ్చు. తీర్పు ఏదైనా గౌరవించాల్సిన అవసరం అందరికీ ఉంది. జగన్ అర్జంటుగా జైలు కెళ్లాలనుకోవడం, నిత్యం పార్టీని ఇబ్బంది పాలు చేసే కన్నా ఎంపీ పదవికి రాజీనామా చేసి తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని రఘురామ కృష్ణరాజును వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు జగన్ ను వదలే ప్రసక్తి లేదంటున్నారు.

Tags:    

Similar News