Raghu rama : రాజును రారాజు చేస్తారట

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సొంత పార్టీ అధినేత జగన్ పైనా, పార్టీపైనా విమర్శలు చేస్తున్నారు. ఆయన రాజకీయంగా అనుకున్నది ఒకటి జరుగుతుంది మరొకటి లాగా ఉంది. [more]

Update: 2021-09-28 02:00 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సొంత పార్టీ అధినేత జగన్ పైనా, పార్టీపైనా విమర్శలు చేస్తున్నారు. ఆయన రాజకీయంగా అనుకున్నది ఒకటి జరుగుతుంది మరొకటి లాగా ఉంది. గత ఏడాదిన్నరగా రఘురామ కృష్ణరాజు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై పార్టీ ఎటువంటి చర్యలకు దిగలేదు. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఇచ్చిన పిటీషన్ ను కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రఘురామ కృష్ణరాజు పై వేటు పడటం కష్టమేనని తెలుస్తోంది.

బీజేపీలో చేరాలనుకున్నా….

అయితే రఘురామ కృష్ణరాజు తొలుత బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేశారు. బీజేపీలోని కొందరు నేతలు, మరికొందరు ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా ఆయన టచ్ లోకి వెళ్లారు. కానీ బీజేపీలో ఆయన చేరిక అంత సులువుగా జరిగేట్లు లేదు. రఘురామ కృష్ణరాజును పార్టీలో చేర్చుకుంటే జగన్ దూరమవుతారని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన చేరికకు బీజేపీ రెడ్ సిగ్నల్ వేసినట్లు చెబుతున్నారు.

టీడీపీ హామీ….

కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం రఘురామ కృష్ణరాజుకు మద్దతుగానే నిలుస్తుంది. అయితే టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో రఘురామ కృష్ణరాజుకు టిక్కెట్ ఇచ్చే అవకాశం కన్పించడం లేదు. కానీ టీడీపీ నుంచి రఘురామ కృష్ణరాజుకు ఒక హామీ లభించినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే తొలి విడతలోనే రాజుగారికి రాజ్యసభ పదవి ఇస్తామన్న గట్టి హామీ లభించిందని అంటున్నారు.

రాజ్యసభకు రాజుగారు…

అందుకే రఘురామ కృష్ణరాజు తెలుగుదేశం పార్టీ లైన్ లోనూ, డైరెక్షన్ లోనూ పనిచేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రఘురామ కృష్ణరాజు చేరికకు బీజేపీ నుంచి కొంత విముఖత రావడంతో ఇక ఆయనకు టీడీపీ మాత్రమే దిక్కవుతుంది. అయితే అనర్హత వేటు కూడా రఘురామ కృష్ణరాజుపై ఇప్పట్లో పడే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. దీంతో రఘురామ కృష్ణరాజు వైసీపీ మరింత రెచ్చిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాజ్యసభ పదవితో పాటు పార్టీలో కీలక పదవి కూడా ఇస్తామని ప్రామిస్ ఇచ్చారంటున్నారు.

Tags:    

Similar News