Raghurama : అంతన్నాడింతన్నాడే…..?

వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఢిల్లీకే పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నర నుంచి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం వైపు చూడటం లేదు. కరోనా కారణంగా నిన్నటి [more]

Update: 2021-10-12 02:00 GMT

వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఢిల్లీకే పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నర నుంచి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం వైపు చూడటం లేదు. కరోనా కారణంగా నిన్నటి మొన్నటి వరకూ రాలేకపోయానని చెప్పుకొచ్చిన రఘురామ కృష్ణరాజు కరోనా తగ్గినా నరసాపురం వైపు చూడటం లేదు. ఆయన కేవలం ఢిల్లీ, హైదరాబాద్ లకు మాత్రమే తిరుగుతున్నారు.

రెండేళ్ల నుంచి…..

రఘురామ కృష్ణరాజు నరసాపురం పార్లమెంటు సభ్యుడు. ఆయన వైసీపీ తరుపున గెలిచి ఇప్పుడు రెబల్ గా మారిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నిత్యం వైసీపీ మీద విమర్శలు చేస్తూ కాకపుట్టిస్తున్నారు. రోజూ మీడియా ముందుకు రావడం, చెప్పిందే చెబుతుండంటంతో రఘురామ కృష్ణరాజు మీడియా సమావేశాలు వెగటు పుట్టిస్తున్నాయి. అయితే ఆయన కోవిడ్ తగ్గితే తాను నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు.

ఇన్ ఛార్జి ఎవరూ లేక…

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కంట్రోల్ లోనే ఉంది. కేసులు తగ్గుముఖంపట్టాయి. కానీ రఘురామ కృష్ణరాజు మాత్రం నరసాపురం పర్యటనకు ముందుకు రావడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఆయన నరసాపురం ప్రజలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని హైదరాబాద్ కు రప్పించుకుని మాట్లాడుతున్నారు. ఆయన తరుపున అక్కడ ఇన్ ఛార్జి అంటూ ఎవరూ లేరు.

కేసులుండటంతో….

అయితే రఘురామ కృష్ణరాజు నరసాపురం రాకపోవడానికి కారణాలున్నాయంటున్నారు. వైసీపీ నేతలు తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదు చేశారు. పార్టీని, జగన్ ను దూషించిన కేసుల్లో రఘురామ కృష్ణరాజును పోలీసులు కేసు నమోదు చేశారు. నరసాపురం వస్తే తనను అరెస్ట్ చేసే అవకాశముందని, వాటిని అన్నింటని క్లియర్ చేసుకున్న తర్వాత వస్తానని రఘురామ కృష్ణరాజు తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. బహుశ సంక్రాంతి కోడిపందేలకు రాజుగారు నరసాపురం వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News