Raghurama : వేటు కోసం పట్టు..లేకుంటే జట్టుతో కట్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటును వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. కానీ స్పీకర్ కార్యాలయం స్పందించడం లేదు. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు సమావేశాలు [more]

Update: 2021-10-24 14:30 GMT

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటును వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. కానీ స్పీకర్ కార్యాలయం స్పందించడం లేదు. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి రఘురామ కృష్ణరాజు అనర్హత పిటీషన్ పై వైసీపీ నేతలు ఢిల్లీలో ఫాలో అప్ చేయాలని నిర్ణయించారు. జగన్ కూడా ఈసారి దీనిపై కొంత సీరియస్ గానే స్పందించే అవకాశముంది.

ఏడాది గడుస్తున్నా….

ఏడాదిన్నరగా రఘురామ కృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వైరి పక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. దీంతో ఏడాది క్రితమే రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఆధారాలను స్పీకర్ కు సమర్పించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి స్పందించిన స్పీకర్ కార్యాలయం రఘురామ కృష్ణరాజుకు నోటీసులు కూడా జారీ చేసింది.

చర్యలు తీసుకోకపోవడంపై….

కానీ ఇంతవరకూ రఘురామ కృష్ణరాజుపై చర్యలు తీసుకోకపోవడంపై వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. తాము కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నా తమను ఇబ్బంది పెట్టేవారిని బీజేపీ రక్షిస్తుందని భావిస్తున్నారు. అనర్హత వేటు స్పీకర్ పరిధిలో ఉన్న అంశమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్నే వైసీపీ నాయకత్వం శంకిస్తుంది. ఈ సారి పార్లమెంటు సమావేశాల్లోగా రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తుంది.

మరోసారి స్పీకర్ ను కలసి….

మరోసారి స్పీకర్ ను కలిసేందుకు వైసీపీ ఎంపీలు సిద్ధమయ్యారు. నవంబరులో మొదలయ్యే పార్లమెంటు సమావేశాలలోపు రఘురామ కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. ప్రతి నిత్యం తలనొప్పిగా మారి పార్టీని ఇబ్బంది కల్గిస్తున్నారన్న అదనపు సమాచారాన్ని కూడా వైసీపీ ఎంపీలు స్పీకర్ కు అందించనున్నారు. ఈసారి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే కార్యాచరణను మార్చేస్తామంటున్నారు వైసీపీ నేతలు.

Tags:    

Similar News