రాజుగారు మాజీ అవుతారా ?

పక్కా స్కెచ్ తోనే వైసీపీ హై కమాండ్ అడుగులు ముందుకు వేస్తోంది. వైసీపీలో జోరీగలాగా మారి అసమ్మతి రాగాలు అసందర్భపు వేళలో ఆలపిస్తూ పార్టీలో కలకలం రేపాలనుకున్న [more]

Update: 2020-06-27 03:30 GMT

పక్కా స్కెచ్ తోనే వైసీపీ హై కమాండ్ అడుగులు ముందుకు వేస్తోంది. వైసీపీలో జోరీగలాగా మారి అసమ్మతి రాగాలు అసందర్భపు వేళలో ఆలపిస్తూ పార్టీలో కలకలం రేపాలనుకున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గారిని మాజీ ఎంపీ చేయడానికి వైసీపీ అధినాయకత్వం చురుకుగా అడుగులు ముందుకువేస్తోంది. ఇక పైన వైసీపీలో రెండవ గొంతుక అపస్వరం చేయకూడదన్న గట్టి పట్టుదలతో అడుగులు ముందుకువేస్తోంది. జగన్ తో చెడితే ఇక పదవికి కూడా తిలోదకాలు ఇచ్చుకోవాల్సిందేనని కొత్త రాజకీయ సూత్రాన్ని చెప్పబోతోంది. ఈ దెబ్బకు అసంతృప్తి ఏ కోశానా ఉన్నా కూడా గమ్మున ఉండడమే బెటర్ అనుకునేలా మొత్తానికి మొత్తం వైసీపీ శిబిరం సీన్ ని మార్చడానికి కూడా సమాయత్తమవుతోంది.

ఆ ఆయుధంతో :

ఇప్పటిదాకా పార్టీని ధిక్కరించిన వారు సస్పెన్షన్ కో, బహిష్కరణకో గురి అయ్యేవారు. వారికి పార్టీతో బంధం తెగిపోతుంది, అయినా కూడా ఆ పార్టీ పరంగా ఇచ్చిన పదవి పదిలంగా ఉంటుంది. అయితే కొన్ని సెక్షన్ల ప్రకారం వారి మీద పదునైన ఆయుధాన్ని ప్రయోగిస్తే దెబ్బకు ఆ పదవి కూడా ఊడి మాజీలవుతారు. ఇపుడు అదే వైసీపీ చేస్తోంది. వాలంటర్లీ గివెన్ ఆఫ్ ది మెంబర్ షిప్ టు ద పార్టీ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ మేధావులకు సైతం ఇదొక అస్త్రం ఉంటుందని పెద్దగా తెలియదు. ఇపుడు ఇదే వైసీపీకి రఘురామకృష్ణంరాజు విషయంలో బలమైన ఆయుధం కాబోతోంది.

సీటు గోవిందా ….

వాలంటర్లీ గివెన్ ది మెంబర్ షిప్ టు ద పార్టీ అన్నది కూడా జోడిస్తూ విజయసాయిరెడ్డి రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తే రఘురామకృష్ణంరాజు లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోవడం ఖాయం. ఇదివరకు ఇలానే జనతాదళ్ (యూ) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ పై ఈ నిబంధన కిందే అనర్హుడిగా ప్రకటించారని పార్లమెంట్ చరిత్ర చెబుతోంది. నిజానికి కధ ఇంతవరకూ వస్తుందని ఊహించని రఘురామకృష్ణంరాజు దీని సంగతేంటో తెలుసుకుందామని ఏకంగా హస్తినకు హుటాహుటిన వెళ్లారటని అంటున్నారు.

మూడు నెలల్లోనే…?

ఈ నిబంధన కింద లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేస్తే మూడు నెలల లోపల సదరు సభ్యుడి పదవి పోవడం ఖాయమని అంటున్నారు. ఫిరాయింపుల చట్టంలోని రాజ్యాంగం పదవ షెడ్యూల్ సెక్షన్ 2 లో దీని సంబంధించిన వివరణ ఉంది. వాలంటర్లీ గివెన్ అప్ ద్ మెంబర్ షిప్ టు ద పార్టీ నిబంధలన కింద ఏ రాజకీయ పార్టీ అయినా తమ చట్టసభల్లో తమ సభ్యుడి మీద స్పీకర్ కి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిఉంటుందని ఈ క్లాజ్ చెబుతోంది. ఇది రాజీనామా గా భావించరు, చర్యగానే చూస్తారు. ఇపుడు ఈ క్లాజ్ ని వెతికిపట్టుకుని మరీ వైసీపీ రఘురామకృష్ణంరాజు గారి మీద ప్రయోగిస్తోంది. దీని వల్ల నర్సాపురంలో ఉప ఎన్నికల ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు. చూడాలి రఘురామకృష్ణంరాజు గారి భవితవ్యం కచ్చితంగా లోక్ సభ స్పీకర్ చేతుల్లోనే ఉంది మరి.

Tags:    

Similar News