కేసులే కాపు కాస్తాయటగా?
పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయం హీటెక్కింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వరసగా కేసులు నమోదవుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనపై కేసులు పెడుతున్నారు. దీనిపై [more]
పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయం హీటెక్కింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వరసగా కేసులు నమోదవుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనపై కేసులు పెడుతున్నారు. దీనిపై [more]
పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయం హీటెక్కింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వరసగా కేసులు నమోదవుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనపై కేసులు పెడుతున్నారు. దీనిపై రఘురామ కృష్ణంరాజు స్పందించడం లేదు. ఎన్ని కేసులు నమోదయితే అంత సింపతీ తనకు వస్తుందని రఘురామ కృష్ణంరాజు భావిస్తున్నట్లుంది. అందుకే కేసుల విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. నిజంగా రఘురామ కృష్ణంరాజుకు సానుభూతి వస్తుందా?
హైకమాండ్ ను థిక్కరించి…..
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీని థిక్కరించారు. అనేక వివాదాల్లో తలదూర్చారు. తానే సుప్రీం అనేలా వ్యవహరించారు. చివరకు రఘురామ కృష్ణంరాజు వైసీపీ కార్యకర్తల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. కొన్నాళ్లు ఓపిక పట్టిన జగన్ ఆయనను ఇక పార్టీలో ఉంచడం ఇష్టం లేక షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీన్ని రఘురామ కృష్ణంరాజు రాజకీయంగా ఫుల్లుగా వాడుకున్నారు. పార్టీ పేరు మీదే వివాదం లేపారు.
వరస కేసులు…..
అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజు పై పశ్చిమ గోదావరి జిల్లాలో వరసగా కేసులు నమోదవుతున్నాయి. మంత్ర రంగనాధరాజు, ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఐదు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన రెండు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ వైసీపీ కార్యకర్తలే రఘురామ కృష్ణంరాజుపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
మరింత ఈజీ అవుతుందని….
అయితే రఘురామ కృష్ణంరాజు మాత్రం కేసులను లైట్ గా తీసుకున్నారు. తనపై ఎన్ని కేసులు నమోదయితే అంత మంచిదనుకుంటున్నారు. ఇప్పట వరకూ బీజేపీ చెంత చేరడానికి కారణాలు రఘురామ కృష్ణంరాజుకు కన్పించలేదు. కేసుల విషయం అడ్డం పెట్టుకుని బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవచ్చని రఘురామ కృష్ణంరాజు భావిస్తున్నారు. కేసులతో తనకు సానుభూతి కూడా వస్తుందని రఘురామ కృష్ణంరాజు నమ్ముతున్నారు. మరి రఘురామ కృష్ణంరాజు అనుకున్నట్లు జరుగుతుందా? లేదా? అన్నదే చూడాల్సి ఉంది.