రాజు గారెవరో తెలియదటగా?

అదేంటి.. ఆయన వైసీపీలో పోరాట యోధుడు కదా. ఏకంగా జగన్ లాంటి కొండతోనే ఢీ కొడుతున్నాడు కదా. టీడీపీ కంటే ఎక్కువగా హాట్ కామెంట్స్ చేస్తూ ఎల్లో [more]

Update: 2020-07-20 13:30 GMT

అదేంటి.. ఆయన వైసీపీలో పోరాట యోధుడు కదా. ఏకంగా జగన్ లాంటి కొండతోనే ఢీ కొడుతున్నాడు కదా. టీడీపీ కంటే ఎక్కువగా హాట్ కామెంట్స్ చేస్తూ ఎల్లో మీడియాకు తెగ ముద్దొచ్చేస్తున్నాడు కదా అని ఆశ్చర్యపోతే పోవచ్చు కాక కానీ ఆయన పోటీ చేసిన చోట మాత్రం రఘురామ కృష్ణంరాజు అంటే ఎవరూ అన్న ప్రశ్నే వస్తోంది మరి. ఇంతకీ ఆ కధా కమామీషూ ఏంటంటే రాజు గారు నర్సాపురం లోక్ సభ సీటు నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయన గెలుపు తన సొంత బలుపు అనుకుంటున్నారు, పైగా తాను సింహాన్ని అని సింగిల్ గానే వస్తాయని భారీ సవాళ్ళు చేస్తున్నారు కదా. మరి ఇంతకీ ఆయన పోటీ చేసిన చోట సీన్ ఏంటి అంటే ఆయనకు అక్కడ పెద్దగా ఏమీ లేదనే జవాబు వస్తోంది.

ఎరగని వారేనా…..?

అవును. రఘురామ కృష్ణంరాజు సొంత ఊరు అదే కావచ్చు కానీ ఆయన ఉండేది వేరే చోట. వ్యాపారాలు వేరొక చోట. మరి రఘురామ కృష్ణంరాజు కేరాఫ్ నర్సాపురం అని చెప్పుకోవడానికి ఏముంది అని జనం అంటున్నారుట. పైగా ఆయన జనంలో ఉన్న మనిషి కారని చెబుతున్నారు. ఆయన అక్కడ ఉద్యమాలు చేయలేదు, ప్రజా సమస్యలపైన అసలు పనిచేయలేదు. తరాలుగా అక్కడే ఉంటే పోనీ మా వూళ్ళోనే ఉంటున్నారు కదా అన్న తృప్తి కూడా లేదు. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా బహు చిత్రం. రాజకీయ పార్టీల అధినేతలతో రిలేషన్స్ తప్ప గ్రౌండ్ లెవెల్లో పెద్దగా బలం లేదని సర్వేలు చెబుతున్నాయి.

అంతేనా…?

రఘురామ కృష్ణంరాజు వైసీపీతో కయ్యానికి కాలు దువ్విన వేళ ఎందుకైనా మంచిదని వైసీపీ తాజాగా ఒక ఫోన్ సర్వే చేయించిందట. నర్సాపురంలోని ఏడు నియోజకవర్గాల్లోనూ జరిగిన ఆ సర్వేలో రాజు గారా? ఎవరో మాకేం తెలుసు రెండు ఓట్లూ జగన్ కే వేశామని జనం చెబుతూంటే విస్తుపోవడం సర్వేక్షకుల వంతు అయిందట. నిజమే అది కూడా అని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. ఆ ఎన్నికల్లో జగన్ గాలి చాలా బలంగా వీచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు అన్న తేడా లేకుండా మొత్తం జనాలు గుద్దేశారు. ఆ ఊపులో గెలిచిన రఘురామ కృష్ణంరాజు తనే అతి పెద్ద రాజకీయ మోతుబరినని మీసాలు మెలిపెడుతూంటే అక్కడ ఓటేసిన జనమే షాక్ తింటున్నారుట.

షాకింగ్ రిజల్ట్ …..

నిజంగా జగన్ పంతం పట్టి ఉప ఎన్నికను నర్సాపురం సీటుకు జరిపిస్తే మాత్రం రాజా వారికి షాకింగ్ ఫలితాలే వస్తాయట. ఇక్కడ వైసీపీకి మద్దతుగా 58 శాతం పైగా ఓటర్లు ఉంటే టీడీపీకి 37 శాతం ఓటర్లు మద్దతుగా ఉన్నారు. ఇక జనసేన, బీజేపీ కాంబోకి కేవలం 4 నుంచి 5 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వేలో తేలిందని అంటున్నారు. అంటే ఉప ఎన్నిక జరిగితే అంత పెద్ద పొడవాటి పేరున్న రాజా వారికి జనం చుక్కలు చూపిస్తారని అంటున్నారు. రాజకీయ అంచనాలు చూసినా అదే నిజం కూడా. ఎందుకంటే అధికార పార్టీకే ఉప ఎన్నికలు ఎపుడూ అనుకూలంగా ఉంటాయి. ఏపీలో బీజేపీకి ఏమీ బలం లేదు, జనసేనకు కూడా మునుపటి ఊపు తగ్గుతుంది. ఇక ఏదైనా పోటీ ఇచ్చేది టీడీపీయే. అయినా ఆ పార్టీ గెలిచే సీన్ ఉండదు. దాంతో రఘురామ కృష్ణంరాజు బీజేపీ తరఫున పోటీ చేస్తే వైసీపీ గెలిచి రెండవ స్థానంలో టీడీపీ ఉంటుందట. ఇక మూడవ ప్లేస్ కి దిగజారి డి రఘురామ కృష్ణంరాజకు పాజిట్లు గల్లంతు అయినా డౌటే లేదని సర్వే ఫలితాలు చెబుతున్నాయట.

Tags:    

Similar News