రాజు గారి సీటు చిరుగుతుందా. ?
రఘురామ కృష‌్ణంరాజు. తెలివైన నాయకుడు. ఎంత అంటే అన్ని పార్టీలతో గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేసేంత. కానీ అతి తెలివి ఏంటి అంటే ఉన్న చెట్టు కొమ్మను [more]
రఘురామ కృష‌్ణంరాజు. తెలివైన నాయకుడు. ఎంత అంటే అన్ని పార్టీలతో గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేసేంత. కానీ అతి తెలివి ఏంటి అంటే ఉన్న చెట్టు కొమ్మను [more]
రఘురామ కృష‌్ణంరాజు. తెలివైన నాయకుడు. ఎంత అంటే అన్ని పార్టీలతో గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేసేంత. కానీ అతి తెలివి ఏంటి అంటే ఉన్న చెట్టు కొమ్మను నరుక్కోడం. అంటే తానున్న వైసీపీ మీదనే రాళ్ళు వేసి రెబెల్ గా నిలవడం. తెలివి ఉంటే ఎన్నో సార్లు పనిచేస్తుంది. కానీ అతి తెలివి మాత్రం ఒకసారే పనికివస్తుంది. ఈ సంగతి తెలిసేటప్పటికి రాజు గారి సీటు కిందకు నీళ్ళు చేరుతున్నట్లుగా భోగట్టా. జగన్ ని ఢీకొట్టి ఎంపీగా కంటిన్యూ కావడం అంటే అంతకంటే అత్యాశ లేదుగా. పైగా జగన్ అధికారంలో చివరి ఏడాదికి వచ్చేశాడా. లేదే. ఏపీలో కొత్తగా పగ్గాలు చేపట్టి అతి బలవంతుడిగా ఉన్నారు.
ఇరిటేట్ చేసినా…..
జగన్ మొండి. ఎంత మొండి అంటే తనకు నచ్చని వారి మాటలను చెవి దాకా కూడా రానివ్వనంత. ఆయన చెవులకు నచ్చిన వారి మాటలే వినిపిస్తాయి. అలా ఆయన తనను తాను ట్యూన్ చేసుకున్నారు కాబట్టే పదేళ్ల రాజకీయ జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా దారుణంగా తిట్టినా జగన్ చెవి దాటి ముందుకు పోలేదు. రాష్ట్ర జాతీయ రాజకీయాలు తీసుకుంటే జగన్ అంతలా నిందలు పడిన నేత మరొకరు ఉండరు, అలాగే జగన్ తిన్నన్ని తిట్లు కూడా ఎవరూ తిని ఉండరు, మరి అపుడే జగన్ ఏదీ ఖాతరు చేయలేదు, ఇపుడు రఘురామ కృష‌్ణంరాజు తిడితే పట్టించుకుంటారా. అందుకే ఎంత రెచ్చగొట్టినా జగన్ చలించలేదు, అలా రాజు గారి వ్యూహానికి బ్రేకులు వేశారు.
ప్లాన్ ఫ్లాప్ ….
జగన్ కి మండిస్తే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, అపుడు ఎంపీ పదవి పదిలంగా ఉంటుందని, ఆ హోదాతో బీజేపీ కండువా కప్పుకుని కొత్త అవతారం ఎత్తుదామని రఘురామ కృష‌్ణంరాజు మాస్టర్ ప్లాన్ వేశారు. అందుకే తెల్లారుతూనే మీడియా మీటింగులు పెట్టి చంద్రబాబుకు అన్నయ్యలా మారి జగన్ ని గట్టిగా తగులుకునేవారు. జగన్ కులం తెచ్చారు, మతం తెచ్చారు, ఆయన్ని విఫల సీఎం అన్నారు. ఏపీ సర్వనాశనం అయిపోయిందని కూడా అన్నారు. ఏపీలో చీమ చిటుక్కుమన్నా కూడా జగన్ దే తప్పు అంటూ రాజు వీరావేశామే చూపించారు. కానీ జగన్ ఎక్కడా చలించలేదు, ఆయన్ని వైసీపీలోనే అలా బంధించి ఉంచారు. దీంతో టెక్నికల్ గా వైసీపీ రఘురామ కృష‌్ణంరాజుగానే ఆయన ఉండిపోకతప్పలేదు.
అనర్హత వేటు…
ఇక జగన్ వంద తప్పులు చూశారని, ఆయన సహనానికి హద్దు ఉందని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. నెలన్నర క్రితం ఢిల్లీ పనిగట్టుకుని స్పెషల్ ఫ్లైట్లో వెళ్లి మరీ లోక్ సభ స్పీకర్ కు రఘురామ కృష‌్ణంరాజు మీద అనర్హత వేటు వేయమని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు, దాని మీద యక్షన్ తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇపుడు ఆ శుభ ఘడియ వచ్చేసింది అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. రఘురామ కృష‌్ణంరాజుని ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా కొనసాగించరాదు ఇదే జగన్ డిమాండ్. ఆయన ఈ విషయంలో కేంద్రంలోని పెద్దల వద్ద తన పలుకుబడిని కూడా ఉపయోగించారని చెబుతున్నారు. వైసీపీ కావాలా. రాజు కావాలా అంటే బీజేపీ ఏం చేస్తుంది. రాజునే బలిపెడుతుంది. ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న బలమైన పార్టీ, లోక్ సభ, రాజ్య సభల్లో ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీ. మొత్తానికి జగన్ కోరినట్లే రఘురామ కృష‌్ణంరాజుని పార్లమెంట్ నుంచి బయటకు పంపడానికే లోక్ సభ స్పీకర్ డిసైడ్ చేశారని అంటున్నారు. వర్షాకాల సమావేశాలు తొందరలో మొదలు కాబోతున్నాయి. నాటికి రఘురామ కృష‌్ణంరాజు ఎంపీ సీటు చిరిగిపోతుందని ఢిల్లీ వర్గాల టాక్. మొత్తానికి రాజు త్వరలోనే మాజీ ఎంపీ అవుతారని వైసీపీ నేతలు గట్టి నమ్మకంగా ఉన్నారట.