రాజుల సీట్లు ఇతరుల‌ పాలు… ?

రాజ్యంలోనే రాజులు ఉన్నారు. అయితే అది కులం కాదని, ఎవరు గద్దెనెక్కితే వారే రాజు అని కూడా ప్రజస్వామ్య సూత్రం ఉంది. ఇక రెండు దశాబ్దలా క్రితం [more]

Update: 2021-10-04 13:30 GMT

రాజ్యంలోనే రాజులు ఉన్నారు. అయితే అది కులం కాదని, ఎవరు గద్దెనెక్కితే వారే రాజు అని కూడా ప్రజస్వామ్య సూత్రం ఉంది. ఇక రెండు దశాబ్దలా క్రితం వరకూ పెద్దగా సామాజిక చైతన్యం లేని రోజులలో రాజులే ఎమ్మెల్యేలుగా చాలా చోట్ల ఉండేవారు. వారిదే హవా అన్నట్లుగా కనిపించేది. ఆధునిక కాలంలోనూ మకుటం లేని మహారాజులా అధికారాన్ని చలాయించేవారు. కానీ కాలం మారింది. ఎవరి వాటా ఏంటో బాగా తెలిసింది. ఈ లెక్కలు అన్నీ కూడిన మీదట తమకూ పవర్ కావాలి అని ఆయా సెక్షన్లు అడగంతో రాజకీయ పార్టీలు ఇవ్వకతప్పింది కాదు. అలా రాజుల కోట నుంచి చాలా సీట్లు గత ఇరవై ఏళ్లలోనూ చేజారాయి.

అక్కడ అంతేనా …?

విశాఖ జిల్లా విషయనికి వస్తే రాజులకు పెట్టని కోటలుగా భీమునిపట్నం, చోడవరం, ఎలమంచిలి వంటి సీట్లు ఉండేవి. ఇక 2009 తరువాత విశాఖ నార్త్ ని కూడా వారే ఏలడం మొదలెట్టారు. అయితే రాజులు జనాభా పరంగా తక్కువ కావడంతో అక్కడ మిగిలిన సామాజిక వర్గాలు పేచీ పెట్టాయి. ఈ పరిణామంతో ముందుగా కాంగ్రెస్ సరికొత్త సమీకరణలకు తెరతీసింది. అలా భీమిలీలో దశాబ్దాలుగా ఉన్న రాజుల ఆధిపత్యానికి 2004 ఎన్నికల్లో గండి కొట్టింది. కేవలం సర్పంచుగా ఉన్న కాపు నాయకుడికి టికెట్ ఇస్తే ఆయన మాజీ మంత్రిగా ఉన్న అప్పల నరసింహ రాజుని ఓడించేశారు. అది లగాయితూ ఈ రోజుకీ మళ్ళీ భీమిలీలో రాజులకు టికెట్ ఏ పార్టీ ఇవ్వలేదు. వరసగా అక్కడ కాపులే గెలుస్తున్నారు.

ఇక్కడా డౌటేనట….

ఇక విశాఖ జిల్లాలో ఎలమంచిలిలో రాజులు బాగా పలుకుబడి కలిగిన వారు. దాంతో చాలా సార్లు వారు ఎమ్మెల్యేలుగా చేశారు. 2004 నుంచి ఇప్పటికి మూడు సార్లు కన్నబాబు రాజు కాంగ్రెస్, వైసీపీ తరఫున గెలిచారు. కానీ 2024లో ఆయనకు కాకుండా కాపులకే టికెట్ ఇవ్వలన్న డిమాండ్ వస్తోంది. జగన్ సైతం ఈసారి వారికే ఆ సీటు రిజర్వ్ చేశారని అంటున్నారు. ఈ పరిణామంతో క్షత్రియ సామాజికవర్గం కలవరపడుతోంది. మరో వైపు చూస్తే చోడవరం నుంచి ఇప్పటికి మూడు సార్లు గెలిచిన టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజుకు కూడా వచ్చేసారి టికెట్ డౌట్ అంటున్నారు. దానికి కారణం అక్కడ కాపుల వత్తిడే. పైగా వైసీపీ నుంచి ఆ సామాజికవర్గం వారే ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో దెబ్బ తీయాలంటే ఇది తప్పనిసరి అని చంద్రబాబు భావించినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

అక్కడితో క్లోజ్ ….

ఇక ఉత్తరాంధా రాజులలో పేరు ఎన్నిక కన్న పూసపాటి రాజులకూ కాపుల సెగ బాగా తగులుతోంది. 2014 ఎన్నికలలో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా కాపు సామాజికవర్గానికి చెందిన మీసాల గీత గెలిచారు. అపుడు అశోక్ ఎంపీ అయ్యారు. అయితే తన పట్టు కోసం ఆయన 2019 ఎన్నికల్లో కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఆమె వైసీపీ చేతిలో ఓడిపోయారు. దాంతో ఈసారి కాపులకే ఈ సీటు ఇవ్వమని డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది. చంద్రబాబు సైతం గెలుపు కోసమే చూస్తారు కాబట్టి అశోక్ సీటుని కాపులకు ఇస్తే కనుక విజయనగరంలో పూసపాటి వారి హవాకు చెక్ పడినట్లే. మొత్తానికి ఇదే వరసలో ఉత్తరాంధ్రాలో మరికొన్ని రాజుల సీట్లకు కూడా ఇతర సామాజిక వర్గాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో రాజుల హావాకు ఉత్తరాంధ్రాలో పూర్తిగా బ్రేక్ పడినట్లే అంటున్నారు.

Tags:    

Similar News