అబ్బాయే బెటర్ కదా ?
శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబమంటే రాజకీయంగా స్ట్రాంగ్ అని అంతా అంటారు. దానికి రుజువు చేస్తూ 2019 ఎన్నికల్లో జగన్ బలామైన వేవ్ నుంచి కూడా బయటకు [more]
శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబమంటే రాజకీయంగా స్ట్రాంగ్ అని అంతా అంటారు. దానికి రుజువు చేస్తూ 2019 ఎన్నికల్లో జగన్ బలామైన వేవ్ నుంచి కూడా బయటకు [more]
శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబమంటే రాజకీయంగా స్ట్రాంగ్ అని అంతా అంటారు. దానికి రుజువు చేస్తూ 2019 ఎన్నికల్లో జగన్ బలామైన వేవ్ నుంచి కూడా బయటకు వచ్చి కింజరాపు ఫ్యామిలీ గెలిచి నిలిచింది ఇక వరసగా రెండవసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచి దివంగత ఎర్రన్నాయుడు అసలైన వారుసుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఆయన తనయుడు రామ్మోహననాయుడు. ఎర్రన్నాయుడు అదే శ్రీకాకుళం లోక్ సభ నుంచి నాలుగు సార్లు గెలిచారన్నది ఇక్కడ ప్రస్థావనార్హం.
అదరగొడుతున్నారుగా…?
తొలిదఫాలోనే రామ్మోహనాయుడు లోక్ సభలో తన ప్రసంగాలతో అదరగొట్టారు. ప్రత్యేకించి బీజేపీ నుంచి విడిపోయాక తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మీద జరిగిన చర్చలో మోడీకి ఆయన సంధించిన ప్రశ్నలు అప్పట్లో అందరిలో ఆలోచనలు రేపాయి. సరిగ్గా ఇపుడు కూడా రామ్మోహననాయుడు ఏపీ ప్రయోజనాలకే లక్ష్యంగా చేసుకుని నిండు సభలో మోడీ సర్కార్ ని ఏకిపారేశారు. ప్రత్యేక హోదా మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద విభజన హామీల మీద రామ్మోహనాయుడు అధికార పార్టీకి తూర్పార పడుతూ ధీటైన ప్రసంగమే చేశారు.
ఒకే ఒక్కడుగా ….
ఎర్రన్నాయుడు తమ్ముడి అన్న ట్యాగ్ తో అచ్చెన్నాయుడు చాలా ముందుగానే రాజకీయాల్లో ఉన్నారు. అచ్చెన్న మంత్రిగా అయిదేళ్ల పాటు పనిచేశారు. కానీ ఆయనతో పోలిస్తే పవర్ ఫుల్ స్పీచ్ ఇవ్వాలంటే కుర్ర ఎంపీ రామ్మోహనాయుడే బెటర్ అన్న చర్చ కూడా అటు పార్టీలో ఉంది. ఇక చంద్రబాబు ఓ వైపు మోడీని నిలదీయలేక కేవలం తన బాణాలను వైసీపీ మీద జగన్ మీద వదులుతున్నారు. అదే రూట్లో అచ్చెన్నాయుడు కూడా జగన్ పై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆడిపోసుకుంటున్నారు. కానీ రామ్మోహననాయుడు మాత్రం ఎక్కడ రోగం ఉందో అక్కడే మందు వేస్తున్నారు అంటున్నారు విశ్లేషకులు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న విశాఖ ఉక్కు విషయంలో నిలదీయాల్సింది వారినే కాబట్టి అక్కడే రామ్మోహననాయుడు శరసంధానం చేసి సీనియర్ల కంటే కూడా తాను ఎంతో మేలు అనిపించుకున్నారు.
కమల కలవరం…..
సరిగ్గా తిరుపతి ఉప ఎన్నికల వేళ బీజేపీ గాలి తీసేస్తూ రామ్మోహననాయుడు పార్లమెంట్ లో చేసిన ప్రసంగం చర్చగానే ఉంది. బీజేపీని ఇంత సూటిగా ధాటిగా విమర్సించిన వారు టీడీపీలోనే కాదు వైసీపీలో కూడా ఎవరూ లేరు. దాంతో కమలనాధుల అటెన్షన్ పూర్తిగా రామ్మోహననాయుడు మీదనే పడుతోంది. చిచ్చరపిడుగులా విరుచుకుపడుతున్న ఈ యువ ఎంపీ ఏపీలో బీజేపీకి నూకలు లేకుండా చేస్తున్నారే అన్న చింత కూడా వారిలో కలుగుతోందిట. మరో వైపు టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నా కూడా గొంతు విప్పుతున్నది మాత్రం రామ్మోహననాయుడే కావడం ఇక్కడ గమనార్హం. ఏది ఏమైనా ఏపీ ప్రయోజనాల కోసం ఒక్క గొంతు అయినా ఢిల్లీలో వినిపించడం పట్ల జనాలు కూడా హర్షిస్తున్నారు. చిన్నవాడు అయినా రామ్మోహననాయుడు నుంచి సొంత పార్టీ బయట పార్టీల జనాలు చాలానే నేర్చుకోవాలి అన్న మాట కూడా ఉంది.