రామకృష్ణకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..ఏం జరిగిందంటే…?
రాష్ట్రంలో ఓ వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలు చేయకపోయినా.. పరోక్షంగా రాజకీయాలు చేస్తూ.. పార్టీలకు దన్నుగా నిలిచే నాయకులు చాలా [more]
రాష్ట్రంలో ఓ వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలు చేయకపోయినా.. పరోక్షంగా రాజకీయాలు చేస్తూ.. పార్టీలకు దన్నుగా నిలిచే నాయకులు చాలా [more]
రాష్ట్రంలో ఓ వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలు చేయకపోయినా.. పరోక్షంగా రాజకీయాలు చేస్తూ.. పార్టీలకు దన్నుగా నిలిచే నాయకులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఒకరు. ఈయన ఉపాధ్యాయ వర్గాలకు చెందిన ఎమ్మెల్సీ. అయితే.. పరోక్షంగా చంద్రబాబుకు మద్దతుదారు. గతంలో చంద్రబాబు కనుసన్నల్లోనే ఈయన మెలిగారు. అంతేకాదు.. ఇటీవల మూడు రాజధానుల బిల్లు మండలికి వచ్చినప్పుడు.. తీవ్రంగా విభేదించారు.
ఉపాధ్యాయవర్గాల కోటాలో…..
ఇక, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారు. మండలి రద్దుపైనా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా ఉపాధ్యాయ వర్గాల కోటా నుంచి మండలికి ఎన్నికైనా కూడా టీడీపీకి సానుకూలంగా వ్యవహరించారు రామకృష్ణ. తరచుగా.. టీవీ చానెళ్ల చర్చల్లోనూ పాల్గొని పార్టీ వాయిస్‌ను వినిపిస్తూ ఉంటున్నారు. పార్టీ నుంచి జరుగుతున్న జంపింగులపైనా ఆయన ఎదురుదాడి చేసి.. చంద్రబాబు తరఫున వాయిస్ వినిపించారు. అయితే, ఇలాంటి నాయకుడికి ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడింది. చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో…….
కీలకమైన గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణ.. 2015 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా 1800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ సమయంలో ఆయనకు నాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు అందరూ మద్దతు తెలిపారు. కానీ, ఇప్పుడు ఆయనను చంద్రబాబు పట్టించుకోవడం మానేశారని స్వయంగా ఆయనే ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
పక్కన పెట్టేశారంటూ…..
తాను టీడీపీకి ఎంతో చేశానని, చంద్రబాబుపై విశ్వాసంతో ఉన్నానని, ఇప్పుడు తనను పక్కన పెట్టారని అన్న ఆయన ఇండిపెండెంట్‌గానే రంగంలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీకి దూరమైన నేపథ్యంలో చంద్రబాబు ఇలాంటి వారినైనా కాపాడుకోలేరా? అనే చర్చ తెరమీదికి రావడం గమనార్హం.