సెట్ చేసేస్తున్నారా?
మహారాష్ట్ర సంక్షోభానికి తెరపడే సూచనలు కన్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలు రెండూ పట్టు వీడకపోవడంతో ఇప్పటి వరకూ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. బీజేపీ [more]
మహారాష్ట్ర సంక్షోభానికి తెరపడే సూచనలు కన్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలు రెండూ పట్టు వీడకపోవడంతో ఇప్పటి వరకూ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. బీజేపీ [more]
మహారాష్ట్ర సంక్షోభానికి తెరపడే సూచనలు కన్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలు రెండూ పట్టు వీడకపోవడంతో ఇప్పటి వరకూ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేదని శివసేనకు తేల్చి చెప్పింది. శివసేన కూడా తమ దారి తాము చూసుకుంటామని వార్నింగ్ లు పంపింది. దీంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రంగంలోకి దిగింది. రెండు పార్టీల మధ్య సయోధ్య చేకూర్చేందుకు ఆర్ఎస్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ రంగంలోకి….
బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉండటంతో ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేదంటోంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సయితం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈనెల 9వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండగా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆర్ఎస్ఎస్ జోక్యం అనివార్యమయింది. ఆర్ఎస్ఎస్ పెద్దన్నగా రెండు పార్టీల మధ్య సయోధ్య చేకూర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమావేశమయ్యారు.
దిగివవచ్చే అవకాశాలే….
శివసేనతో కూడా ఆర్ఎస్ఎస్ నేతలు చర్చలు జరిపే అవకాశముంది. శివసేన ప్రతిపాదనను కూడా ఆర్ఎస్ఎస్ సీరియస్ గానే పరిశీలిస్తుంది. శివసేన అవసరం బీజేపీకి ఉండటంతో కొంత తగ్గడమే బెటరని ఆర్ఎస్ఎస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ బుజ్జగింపులతో ఉద్ధవ్ థాక్రే సయితం కొంత దిగివచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఫిఫ్టీ ఫిఫ్టీ గా ముఖ్యమంత్రి పదవి శివసేన, బీజేపీ పంచుకునేందుకు బీజేపీ కూడా అంగీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది.
ఎన్సీపీ షరతులు….
శివసేన ఇప్పటికే ఎన్సీపీ, కాంగ్రెస్ లతో టచ్ లోకి వెళ్లింది. అయితే ఎన్సీపీ మాత్రం బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతనే మద్దతిచ్చే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పింది. కాంగ్రెస్ మాత్రం తాము శివసేనకు మద్దతిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో శివసేనకు బీజేపీతో వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగడంతో రెండు పార్టీల నేతలు ఒక మెట్టు దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.