పేరు ఇలా తెచ్చుకున్నారా?
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంలో ఆయన పేరు బయటకు రావడంతో తిరిగి ఆయన రాజకీయంగా తెరపైకి [more]
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంలో ఆయన పేరు బయటకు రావడంతో తిరిగి ఆయన రాజకీయంగా తెరపైకి [more]
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంలో ఆయన పేరు బయటకు రావడంతో తిరిగి ఆయన రాజకీయంగా తెరపైకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన అక్కడి నుంచి బీజేపీలోకి మారిన రావెల కిశోర్ బాబు గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే గత ఐదు నెలలుగా రావెల కిశోర్ బాబు సైలెంట్ గానే ఉంటున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రావెల కిశోర్ బాబు ఆ నియోజకవర్గానికి కూడా పెద్దగా రావడం లేదు.
సైలెంట్ గా ఉంటున్న…..
ఎక్కువగా హైదరాబాద్, గుంటూరుల్లోనే ఉంటున్నారు. అయితే రాజధాని భూములు కొన్న నేతల పేర్లను ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి బయటపెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుతో పాటుగా ఆయనకు చెందిన మైత్రి వ్యాపార సంస్థ భూములు కొనుగోలు చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే రావెల కిశోర్ బాబు ఈ ఆరోపణలు ఖండిస్తున్నా ప్రభుత్వం మాత్రం భూములు కొనుగోలు చేసిన నేతల పేర్లలో రావెల కిశోర్ బాబు పేరును చేర్చడం చర్చనీయాంశంగా మారింది.
రాజధాని భూములతో…..
అయితే బీజేపీలో చేరినప్పటికీ రావెల కిశోర్ బాబు పెద్దగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యక్రమాల్లో అడపా, దడపా పాల్గొనడమే తప్ప ఆయన రాజకీయంగా పెద్దగా కన్పించింది లేదు. రావెల తన వ్యాపారాలను, భూములను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరకుండా తర్వాత చేరడంతోనే అనుమానాలు బయలుదేరాయి. అయితే రావెల వ్యవహరాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు.
రైతులకు అండగా….
తాజాగా రావెల కిశోర్ బాబు పేరు భూ కొనుగోళ్లలో విన్పించడంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. తనకు రాజధానిలో భూములు లేవని, మైత్రి సంస్థ తనకు చెందింది కాదని, నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. రాజధాని అమరావతి రైతులకు అండగా రావెల కిశోర్ బాబు నిలిచారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అమరావతిని మూడు ముక్కలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళతానని చెప్పారు. మొత్తం మీద రావెల రాజధాని భూముల వ్యవహారంతో యాక్టివ్ అయ్యారంటున్నారు.