ఉచ్చు బిగుసుకుంటోంది
దాదాపు పదిహేనేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన టివి 9 రవి ప్రకాష్ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ పై ఉచ్చు [more]
దాదాపు పదిహేనేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన టివి 9 రవి ప్రకాష్ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ పై ఉచ్చు [more]
దాదాపు పదిహేనేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన టివి 9 రవి ప్రకాష్ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ పై ఉచ్చు అన్ని వైపులా మరింత బిగిసేలాగే కనిపిస్తుంది. అలంద మీడియా ఇప్పటి వరకు పెట్టిన కేసుల్లో కోర్టులు పోలీస్ స్టేషన్ లు చుట్టూ తిరిగి తిరిగి అలసి పోయిన రవి ప్రకాష్ పై నిధులను దారి మళ్ళించిన కేసులో అరెస్ట్ కాక తప్పలేదు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేస్తుండగానే మరికొన్ని అస్త్రాలను ఇప్పుడు వైసిపి ఎక్కుపెట్టింది. వాటిని ఆయనపై ప్రయోగించి విజయవంతం అయితే ఇప్పట్లో రవిప్రకాష్ బయటపడే ఛాన్స్ లు తక్కువనే అంటున్నారు న్యాయనిపుణులు.
సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ …
తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాశారు. రవి ప్రకాష్ పై ఈడీ, సిబిఐ దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసి సంచలనం సృష్ట్టించారు. అక్రమంగా మనీ లాండరింగ్ కి రవి ప్రకాష్ పాల్పడ్డారని సాయి రెడ్డి ఆరోపించారు. విదేశాల్లోని ఉంగాడా, కెన్యా వంటి దేశాల్లో కేబుల్ వ్యాపారం మొదలు పెట్టారని వీటికి నిధులు ఎక్కడినుంచి వచ్చాయన్నది ప్రశ్నించాలని కోరారు.
అవి రంగంలోకి దిగతే..
అలాగే సానా సతీష్, మొయిన్ ఖురేషీతో కూడా రవిప్రకాష్ కు సంబంధాలున్నాయని వారు ఆరోపింారు. అనేక స్కామ్ లకు పాల్పడిన రవి ప్రకాష్ పై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని కోరారు. ఈ ఫిర్యాదు ను సుప్రీం స్వీకరించి దర్యాప్తు చేస్తే మాత్రం సమీప భవిష్యత్తులో ఆయన చిక్కుల్లోనుంచి బయటపడటం కష్టమేనని నిపుణుల అభిప్రాయం. మరి చూడాలి మీడియా ట్రెండ్ సెట్టర్ పరిస్థితి.