గరుడపక్షి దొరక్కపోతే రవి ప్రకాష్ బుక్ అవుతారా …?
టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రవి ప్రకాష్ చేయని ప్రయత్నం లేదు. [more]
టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రవి ప్రకాష్ చేయని ప్రయత్నం లేదు. [more]
టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రవి ప్రకాష్ చేయని ప్రయత్నం లేదు. తమ విచారణ కు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి తలనొప్పి తెప్పించినందుకు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని పోలీసులు సిద్ధంగా వున్నారు. సుప్రీం కోర్టు లో వేసిన కేసు కారణంగా ఇప్పటికైతే అరెస్ట్ తప్పించుకున్నా ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఈనెల 18 న తీర్పు ఇవ్వనుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలా లేదా అన్న అంశం పై విచారణ పూర్తి అయ్యింది. బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని ప్రాసిక్యూషన్ బలంగా వాదించిన నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.
ఇంకా ఆచూకీ లేని శివాజీ …
టివి 9 వ్యవహారం లో గరుడ పురాణం శివాజీ పాత్ర అత్యంత కీలకం. అయితే ఈ కేసు నమోదు అయినప్పటినుంచి శివాజీ పత్తా లేకుండా పారిపోయాడు. ఈ గరుడ పక్షి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు జల్లెడ వేసి గాలిస్తున్నాయి. శివాజీ కనుక పోలీసుల ముందు హాజరు అయినపక్షంలో కోర్టు రవిప్రకాష్ కి బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయవాదులు అంటున్నారు. కేసులో నిందితులంతా అందుబాటులోనే ఉన్న నేపథ్యంలో బెయిల్ కి పెద్దగా అభ్యంతరాలు ఉండవని చెబుతున్నారు. కానీ గరుడ శివాజీ పోలీసుల ముందుకు రానంత వరకు కేసు పురోగతి సాధ్యం కానందున బెయిల్ మంజూరు చేయరాదని ప్రస్తుత టివి 9 యాజమాన్యం కోరుతుంది. ఈ వాదనతో పోలీస్ వార్గాలు ఏకీభవిస్తున్నాయి. వీరిద్దరి వాదనను కోర్టు అంగీకరిస్తే రవిప్రకాష్ అరెస్ట్ తధ్యమంటున్నారు విశ్లేషకులు.