రాజకీయాలు శాసించిన కుటుంబాలు యాచనకు దిగయా?
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లాగా ఉన్న గుంటూరులో అనేక మంది రాజకీయ నేతలు ఉన్నారు. వీరిలో కొందరు దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న వారు కూడా ఉన్నారు. వీరిలో [more]
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లాగా ఉన్న గుంటూరులో అనేక మంది రాజకీయ నేతలు ఉన్నారు. వీరిలో కొందరు దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న వారు కూడా ఉన్నారు. వీరిలో [more]
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లాగా ఉన్న గుంటూరులో అనేక మంది రాజకీయ నేతలు ఉన్నారు. వీరిలో కొందరు దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న వారు కూడా ఉన్నారు. వీరిలో కొందరు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నారు. మరికొందరు ఇప్పటికే రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో వారి రాజకీయాలు ఏవిధంగా ఉన్నాయనే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక్కొక్కరుగా చూసుకుంటే.. ఈ జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాయపాటి సాంబశివరావు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నసమయంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు. కాంగ్రెస్ నుంచి ఆయన ఐదుసార్లు లోక్‌సభకు ఒకసారి రాజ్యసభకు ఎంపికయ్యారు.
రాయపాటి ఇక రాజకీయాలకు…..
రాష్ట్ర విభజనతో ఆయన కాంగ్రెస్‌ను వీడి.. టీడీపీలోకి వచ్చి 2014లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. గత ఏడాది ఎన్నికల్లో పట్టుబట్టి టికెట్ తెచ్చుకున్నా.. పిన్నవయస్కుడైన వైఎస్సార్ సీపీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలుపై విజయం సాధించలేకపోయారు. ఇది ఆయనకు తీవ్ర అవమానంగా ఉందని టాక్. దీనికితోడు వయోవృద్ధుడు కూడా అయిపోవడంతో ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమణకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు రంగారావు, ప్రస్తుతం పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ.. ఆయనకు సరైన నియోజకవర్గం అంటూ ఏమీ లేదు.
ఏదో ఒక నియోజకవర్గమంటూ…
ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పగ్గాలు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించలేదు. అయితే, ఇది ఇచ్చినా ఇవ్వకున్నా.. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అయినా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క, గత ఏడాది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాద్ కూడా 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన వారసుడు కోడెల శివరామకృష్ణ.. కూడా టికెట్ అడుగుతున్నారని అంటున్నారు. కోడెల జిల్లాలో నరసారావుపేట, సత్తెనపల్లి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో కోడెల ఓటమి పాలయ్యారు.
కన్నా కుమారుడు కూడా….
ఈ నేపథ్యంలో ఆ సీటును తనకు రిజర్వ్ చేయాలని కోరుతున్నారు. దీనిపైనా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. ఇక, బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముప్పైఏళ్లుగా ఆయన కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన కుమారుడు గతంలో గుంటూరు మేయర్‌గా చేశారు. అయితే… బీజేపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడుగా ఉన్నా పార్టీపై పట్టు సాధించలేక పోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కుమారుడి రాజకీయాలు కూడా సన్నగిల్లాయి. ఇటీవల ఆయన ఇటీవల కోడలు చనిపోవడంతో డిప్రెషన్లో ఉన్నారు.
అస్థిత్వం కోసం….
దీంతో కన్నా కుటుంబం రాజకీయాలు కూడా అర్ధం కావడం లేదు. అటు తండ్రి, ఇటు కొడుకు రాజకీయాలు ఎప్పుడు పుంజుకుంటాయా? అని అనుచరులు ఎదురు చూస్తున్నారు. ఇక, తెనాలిలో దివంగత మాజీ మంత్రి అన్నాబత్తుని సత్య నారాయణ టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చక్రం తిప్పారు. ఇక, ఇప్పుడు ఆయన కుమారుడు అన్నాబత్తుని శివకుమార్ వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించారు. మంచి దూకుడుపై ఉన్నారు. ఇలా నాడు గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించిన నేతల కుటుంబాల ప్రాభవం ఇప్పుడు పూర్తిగా అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితికి వచ్చేసింది.