రాయపాటి రూటు మార్చారటగా

రాజ‌కీయాల్లో ఆయ‌న చాలా సీనియ‌ర్ నేత‌. నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుడు . గుంటూరు జిల్లాకు చెందిన నాయ‌కుల్లో కురువృద్ధుడు. అయితే, ఏ చిన్న వివాదం [more]

Update: 2019-08-16 09:30 GMT

రాజ‌కీయాల్లో ఆయ‌న చాలా సీనియ‌ర్ నేత‌. నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుడు . గుంటూరు జిల్లాకు చెందిన నాయ‌కుల్లో కురువృద్ధుడు. అయితే, ఏ చిన్న వివాదం కూడా అంట‌ని నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆ పార్టీతో విభేదించి వైసీపీ ఆహ్వానించినా.. ఆ పార్టీ వంక క‌న్నెత్తి కూడా చూడ‌కుండానే .. ఆయ‌న టీడీపీలో చేరి 2014లో న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు.

పోరాడి మరీ….

ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌నకు టికెట్ ఇచ్చే విష యంలో చంద్రబాబు వెనుక‌డుగు వేస్తున్నార‌ని వ‌చ్చిన వార్తల నేప‌థ్యంలో తీవ్రంగా వ్యాఖ్యానించి చివ‌ర‌కు బాబు నుంచి టికెట్ తెచ్చుకున్నారు. అయితే, ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ ముందు ఆయ‌న త‌ట్టుకోలేక పోయారు. ఈ క్రమంలోనే ఆయ‌న ఓడిపో యారు. స‌రే.. సుదీర్ఘ రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌నే విష‌యం ఆయ‌న‌కు తెలియంది కాదు. ఈ క్రమంలోనే ఆయ‌న స‌రిపెట్టుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, వ్యూహాత్మకంగా ఆయ‌న పార్టీ మా రేందుకు రెడీ అయ్యార‌నే వ్యాఖ్యలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి.

కుమారుడికి కీలక బాధ్యతలు….

దీనిని ముందుగానే ప‌సిగ‌ట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రాయ‌పాటి సాంబశివరావు కుమారుడు రంగారావుకు పార్టీలో కీల‌క బాధ్యతలు అప్పగిస్తామ‌ని చెప్పా రు. ఓ నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న‌ను ఇంచార్జ్‌ను చేస్తామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా మ‌ని కూడా క‌బురు పంపారు. దీంతో రాయ‌పాటి పార్టీ మారే ఆలోచ‌న‌ను ప‌క్కన పెడ‌తార‌ని చంద్రబాబు భావించారు. కానీ, రాయ‌పాటి మాత్రం చంద్రబాబుకు ఝ‌ల‌క్ ఇచ్చేందుకే రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. రాయపాటి టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

జగన్ పాలనకు శభాష్….

గత నెలలో కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు పార్టీ మార్పుపై రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి. అయితే, వీటిని పెద్దగా ప‌ట్టించుకోని అధిష్టానానికి మ‌రోసారి రాయ‌పాటి షాక్ ఇచ్చారు. తాజాగా ఆయ‌న జ‌గ‌న్ పాల‌న‌పై స్పందించారు. గ‌తంలో ఎప్పటిక‌ప్పుడు జ‌గ‌న్ ను విమ‌ర్శించిన రాయ‌పాటి.. తాజాగా ఆయ‌న పాల‌న‌ను మెచ్చుకున్నారు. శుక్రవారం నాడు తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాయపాటి జగన్ మోహన్‌రెడ్డి పరిపాలన చాలా బాగుందని వ్యాఖ్యానించారు. నవరత్నాలు పథకానికి నిధుల కొరత ఉందని.. అయితే కేంద్రం మాత్రం రాష్ట్రానికి సహకరించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

వైసీపీలోకేనా….?

తాను ఏ పార్టీలో చేరాలనే అశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నూతన టెండర్లు పిలవడం వల్ల వ్యయం పెరుగుతుందని ఆయ‌న జ‌గ‌న్‌కు సూచించారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో ఇక‌, రాయ‌పాటి పార్టీ మార‌డం ఖాయ‌మేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అయితే, అది బీజేపీనా.. లేదు.. తాజా వ్యాఖ్యల‌ను బ‌ట్టివైసీపీనా? అనేది త్వర‌లోనే తేలిపోనుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News