నిర్ణయం మార్చుకున్నారా? వారి ఫేట్ మారిందా?

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారనున్నాయి. అంతా తమ వైపే ఉందనుకున్న వేళ వరదలు వచ్చి సీన్ మొత్తం మార్చేసింది. [more]

Update: 2020-11-01 11:00 GMT

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారనున్నాయి. అంతా తమ వైపే ఉందనుకున్న వేళ వరదలు వచ్చి సీన్ మొత్తం మార్చేసింది. ఇటీవల కురిసిన వరదలతో అధికార పార్టీ పై బాధితులు మండిపడుతున్నారు. వీరిని సముదాయించి తమవైపునకు తిప్పుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పైనే ఉంది. ముఖ్యంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ పైనే వత్తిడి ఎక్కువగా ఉంది.

తమదే విజయమన్న…..

మొన్నటి వరకూ కేటీఆర్ బిందాస్ గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాలో ఉన్నారు. సర్వేలు కూడా అవే చెబుతున్నాయని తెలిపారు. ఒక్క పదిహేను మంది కార్పొరేటర్లపైనే అసంతృప్తి ఉందని వారు తమ పనితీరు మార్చుకోవాలని కేటీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యేలకు కూడా సూచించారు. ఈసారి కూడా వంద మార్కు దాటతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

వరదలతో సీన్ రివర్స్…..

అయితే ఇటీవల కురిసిన వరదలు సీన్ రివర్స్ చేశాయంటున్నారు. వరదలతో హైదరాబాద్ ప్రజలు అతలాకుతలం అయ్యారు. మంచినీళ్లు కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారు. సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పరామర్శకు వచ్చిన కార్పొరేటర్ల నుంచి మంత్రుల వరకూ ఎవరినీ వదలిపెట్టకుండా బాధితులు నిలదీస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సయితం బాధితుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. వీటన్నింటి మధ్య ఎన్నికలు జరిగితే అధికార పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది.

సిట్టింగ్ లను మార్చాలని….

అప్పటికీ బాధితుల కోసం ముఖ్మమంత్రి కేసీఆర్ పరిహారం ప్రకటించారు. తక్షణ సాయాన్ని అందజేశారు. కానీ ఇవేమీ బాధితుల ఆగ్రహాన్ని చల్లార్చేటట్లు లేవు. ప్రభుత్వం చేసే అరకొర సాయం వారిని సంతృప్తి పర్చలేదు. దీంతో కేటీఆర్ ప్రస్తుతమున్న సిట్టింగ్ లను ఎక్కువ మందిని మార్చాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. సిట్టింగ్ లకు ఇస్తే గెలవడం కష్టమని భావించి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వరదలతో సిట్టింగ్ కార్పొరేటర్ల ఫేట్ మారిపోయిందంటున్నారు.

Tags:    

Similar News