Renuka : ఢిల్లీనే నమ్ముకున్నారట. అందుకే అలా?

కాంగ్రెస్ లో అసలు నేతలున్నారా? ఉంటే ఏమయ్యారు. ప్రజలతో కనెక్ట్ అవ్వగలిగిన నేతలు కాంగ్రెస్ లో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా మౌనంగా ఉండటం [more]

Update: 2021-11-10 09:30 GMT

కాంగ్రెస్ లో అసలు నేతలున్నారా? ఉంటే ఏమయ్యారు. ప్రజలతో కనెక్ట్ అవ్వగలిగిన నేతలు కాంగ్రెస్ లో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా మౌనంగా ఉండటం పార్టీని మరింత ఇబ్బంది పెడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే నేతలందరూ ఐక్యంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ కారణాలేంటో తెలియదు కాని కొందరు నేతలు బయటకే రావడం లేదు. కనీసం ఉప ఎన్నికల్లో చైతనైనంత సాయం చేద్దామన్న స్పృహ కూడా నేతల్లో కొరవడింది. వారిలో సీనియర్ నేత రేణుకా చౌదరి ఒకరు.

సీనియర్ నేతగా….

రేణుకా చౌదరి సీనియర్ కాంగ్రెస్ నేత. ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్ర ఉంది. తెలంగాణలో గుర్తింపు ఉన్న నేతగా ఆమెకు పేరుంది. కానీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఆమె కన్పిస్తారు. తర్వాత ఆమె పార్టీలో ఉన్నారా? లేదా? అన్నట్లుగా వ్యవహరిస్తారు. గత ఏడేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో రేణుకా చౌదరి పేరు విన్పించడం లేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఖమ్మంలో పోటీకి దిగి ఒక రెండు నెలలు కన్పించి వెళ్లిపోయారు.

వారితో టచ్ లోనే…

ఆ తర్వాత రేణుకా చౌదరి ఎక్కడున్నారని అడిగితే ఢిల్లీ టూ హైదరాబాద్ తిరుగుతున్నారని చెబుతున్నారు. రేణుకా చౌదరి గాంధీ భవన్ కు వచ్చి చాలా కాలమే అయింది. ఢిల్లీకి మాత్రం దగ్గరగానే ఉన్నారంటున్నారు. తరచూ ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో టచ్ లో ఉంటున్న రేణుకా చౌదరి ఇటీవల జరిగిన సాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన లేదు. రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా ఆమెను లైట్ గానే తీసుకుందని చెప్పాలి.

ఇక్కడ వేస్ట్ అంట….

రేణుకా చౌదరి కాంగ్రెస్ అధికారంలో ఉండగా రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ పదవీ కాలం పూర్తి కావడంతో ఇక కొన్నేళ్లుగా ఆమె ఖాళీగానే ఉన్నారు. కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఇక్కడ కష్టపడినా గుర్తింపు వచ్చే అవకాశం లేదు. అందుకే రేణుకా చౌదరి ఢిల్లీనే నమ్ముకున్నారు. అక్కడ అధికారం వస్తే చాలు పదవి పొందడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం తన సామాజికవర్గం ఓటర్లను కూడా కాంగ్రెస్ వైపు రాష్ట్రంలో తిప్పేందుకు రేణుకా చౌదరి ప్రయత్నించకపోవడంపై విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News