మళ్లీ వీరిద్దరే …దటీజ్ ఇండియన్ బ్లడ్

బ్రిటన్ తట్టుకోలేక పోతోంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ కరోనా వైరస్ వీఐపీలను కూడా వదలడం లేదు. తనకు ఎవరూ అతీతం కాదని కరోనా నిరూపిస్తున్నట్లుంది. బ్రిటన్ [more]

Update: 2020-03-29 17:30 GMT

బ్రిటన్ తట్టుకోలేక పోతోంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ కరోనా వైరస్ వీఐపీలను కూడా వదలడం లేదు. తనకు ఎవరూ అతీతం కాదని కరోనా నిరూపిస్తున్నట్లుంది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా సోకింది. అలాగే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నూ కరోనా వదలిపెట్టలేదు. ఇక ఆరోగ్య శాఖ మంత్రితో పాటు అనేక మంది వీఐపీలు కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నారు. బ్రిటన్ లో ఇప్పటి వరకూ 14 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా కరాళ నృత్యం…..

ఇప్పటి వరకూ బ్రిటన్ లో 748 మంది చనిపోయారు. బ్రిటన్ లో కూడా కరోనాను నిర్లక్ష్యం చేశారు. కరోనా ప్రమాదాన్ని ముందుగా పసిగట్ట లేకపోయారు. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను హెచ్చరించలేదు. అప్రమత్తం చేయలేదు. ఫలితాన్ని ఇప్పుడు దేశమంతా చూడాల్సి వస్తుంది. బ్రిటన్ రాణికి సయితం వైరస్ సోకిందని ప్రచారం జరిగినా తర్వాత దానిని ఖండించారు.

హోం క్వారంటైన్ లో…..

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలనను పర్యవేక్షిస్తున్నారు. అయితే కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుడటం తో ప్రధాని బోరిస్ జాన్సన్ అక్కడ కరోనా నియంత్రణ బాధ్యతను ఇద్దరు ప్రవాస భారతీయులకు అప్పగించారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న రిషిక్ సునాక్, హోంమంత్రి ప్రీతి పటేల్ కు కరోనా కట్టడి బాధ్యతలను అప్పగించారు.

వీరిద్దరికి బాధ్యతలు…

వీరిద్దరూ బ్రిటన్ లో పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని రిషి సునాక్ ను, ప్రీతి పటేల్ ను ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు. రిషి సునాక్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. ఇక గుజరాత్ కు చెందిన ప్రీతి పటేల్ బ్రిటన్ లో స్థిరపడ్డారు. గత ఎన్నికల్లో వీరిద్దరూ గెలవడంతో జాన్సన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో గట్టెక్కడానికి జాన్సన్ వీరిద్దరి మీదే ఆధారపడ్డారు. మొత్తం మీద స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటన్ భారత్ ను శాసిస్తే ఇప్పుడు ప్రవాస భారతీయులే వారికి అన్నింటా దిక్కయ్యారు.

Tags:    

Similar News