రోజాను డైల్యూట్ చేస్తోందెవరు ? సొంతోళ్లేనా?
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తాజాగా ఒక సంచలన వీడియో మీడియాలో హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఆమె నోరు విప్పితే.. [more]
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తాజాగా ఒక సంచలన వీడియో మీడియాలో హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఆమె నోరు విప్పితే.. [more]
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తాజాగా ఒక సంచలన వీడియో మీడియాలో హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఆమె నోరు విప్పితే.. తిట్టిపోస్తున్న, విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును అత్యంత పతాక స్థాయిలో మెచ్చుకుంటూ.. పొగడ్తల వర్షం కురిపించిన వీడియో కావడంతో వైసీపీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు.. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా రోజా.. చేసిన కామెంట్ల తాలూకు వీడియో ఇది. దీనిలో ఆమె చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. అంతన్నారు.. ఇంతన్నారు.. మొత్తానికి చంద్రబాబు వంటి నాయకుడు లేరన్నారు.
బాబుపై పొగడ్తలు…
‘‘తెలుగుతల్లి అన్నపూర్ణ వరాలపట్టి.. అమ్మణ్ణమ్మ కలల పంట.. నందమూరి సింహ రాజకీయ వారసుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధాదురంధురుడు, పేదల పాలిట పెన్నిధి, తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు.. జగమంతా మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర.. ధీర.. శూర రాజకీయ చక్రవర్తి.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు’’ అంటూ రోజా కీర్తించారు.
తిరుపతి ఉప ఎన్నికల సమయంలోనూ…
అయితే.. ఇప్పుడు హఠాత్తుగా ఈ వీడియో వెలుగు చూడడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆమె టీడీపీ ని విడిచిపెట్టి పదేళ్లు అయింది. అప్పటి నుంచి ఆమె వైసీపీలో కొనసాగుతున్నారు. పైగా జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నా రు. ఇటీవల తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయంలోనూ ఆస్పత్రిలో ఉండి కూడా వీడియో విడుదల చేసి.. దానిలోనూ చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాంటి రోజాకు సంబంధించి ఇప్పుడు విడుదలైన వీడియో.. వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని.. రోజా వర్గం భావిస్తోంది.
సొంత పార్టీ నేతలే…?
నగరిలో రోజాను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న కేజే కుమార్ వర్గం ఓ మంత్రి నేతృత్వంలో పనిచేస్తోందని.. వారే తనను డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో పాత వీడియోను సోషల్ మీడియాలో పెట్టారని.. టీడీపీ అనుకూల మీడియా దీనిని మరింత పెద్దది చేసి.. తనకు.. సీఎం జగన్‌కు మద్య విభేదాలు సృష్టించేందుకు, కేడర్‌లో ఒక గందరగోళాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని.. రోజా అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు రోజా వీడియో.. మాత్రం ఆసక్తిగా మారింది. చివరికి దీనిపై ఆమె మీడియా ముందుకు వచ్చి ఏం చెబుతారో చూడాలి.