Rk roja : మంత్రి పదవి దక్కకుంటే రోజా రియాక్షన్ ఇలాగేనట
కొందరిని పదవులకు దూరంగా ఉంచితే మంచిది. మరికొందరిని పదవిలోనే ఉండటం మంచిది. అలా రెండో రకానికి చెందిన వారు ఆర్కే రోజా. అనకూడదు కాని రాజకీయాల్లో వేగంగా [more]
కొందరిని పదవులకు దూరంగా ఉంచితే మంచిది. మరికొందరిని పదవిలోనే ఉండటం మంచిది. అలా రెండో రకానికి చెందిన వారు ఆర్కే రోజా. అనకూడదు కాని రాజకీయాల్లో వేగంగా [more]
కొందరిని పదవులకు దూరంగా ఉంచితే మంచిది. మరికొందరిని పదవిలోనే ఉండటం మంచిది. అలా రెండో రకానికి చెందిన వారు ఆర్కే రోజా. అనకూడదు కాని రాజకీయాల్లో వేగంగా నిర్ణయాలు పనికి రావు. కానీ రోజా విషయంలో అవన్నీ జాన్తా నై. తనకు నచ్చకపోతే మొఖం మీదే చెప్పే మనస్తత్వం ఆమెది. రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనని ఆలోచించరు. తాను పడిన కష్టానికి ప్రతిఫలాన్ని కోరుకుంటారు. అలాంటి రోజాకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందా? అన్నది చివర వరకూ ఉత్కంఠే.
చిత్తూరు కావడంతో….
ఎందుకంటే రోజా ఉన్నది చిత్తూరు జిల్లాలో. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని జగన్ ఏమీ చేయలేరు. అంటే పెద్దిరెడ్డి కి జగన్ అంత విలువ ఇస్తారు. పెద్దిరెడ్డి కూడా జగన్ అప్ప జెప్పిన పనిని అలాగే పూర్తి చేస్తారు. కానీ రోజా పార్టీ పట్ల అంకిత భావంతో ఉంటారు. జగన్ మీద మాట పడితే ఊరుకోరు. విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి రోజా లాంటి అతి కొద్ది మంది నేతలే ప్లస్ అయ్యారనడంలో అతిశయోక్తి లేదు.
వెంటనే చూపించి….
అలాంటి ఆర్కే రోజా వైసీపీ అధికారంలోక రాగానే తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ జగన్ సామాజిక సమీకరణాల వల్ల ఇవ్వలేకపోయారు. రోజా అలాగని తన మనసులో ఆగ్రహాన్ని దాచుకోలేదు. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి గైర్హాజరయి తన నిరసనను తెలియజేశారు. చివరకు జగన్ దిగి రావాల్సి వచ్చింది. ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. దీంతో రోజా కొంత శాంతించారు.
ఈసారి పంచ్ మామూలుగా ఉండదట….
కానీ ఈసారి అలా కాదు… మంత్రి పదవి ఈ విస్తరణలోనూ రాకుంటే రోజా రియాక్షన్ వెను వెంటనే ఉండే అవకాశాలున్నాయి. పంచ్ మామూలుగా ఇవ్వదన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. రోజాకు మంత్రి పదవి ఇవ్వకూడదని జగన్ కు ఏ కోశానా ఉండదు. కానీ రెడ్డి సామాజికవర్గం నేత కావడం వల్లనే ఆమెకు మంత్రి పదవి దక్కడం చివరి నిమిషం వరకూ చెప్పలేం. అందుకే రోజా విషయంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పార్టీలో నెలకొంది.