రికార్డ్ ల కోసమే పుట్టిన రోహిత్ శర్మ

ప్రపంచ కప్ లో ఇప్పుడు రోహిత్ నామస్మరణ గట్టిగా వినిపిస్తుంది. క్రికెట్ అభిమానులు దేశాల హద్దులు చెరిపి మరీ రోహిత్ ఫ్యాన్స్ గా మారిపోయారు. భారత ఓపెనర్ [more]

Update: 2019-07-07 01:49 GMT

ప్రపంచ కప్ లో ఇప్పుడు రోహిత్ నామస్మరణ గట్టిగా వినిపిస్తుంది. క్రికెట్ అభిమానులు దేశాల హద్దులు చెరిపి మరీ రోహిత్ ఫ్యాన్స్ గా మారిపోయారు. భారత ఓపెనర్ గా కుదురుకుంటే మ్యాచ్ చేజారిపోయినట్లే అని ప్రత్యర్ధులు సైతం వణికిపోయే ఫామ్ లో రోహిత్ శర్మ బ్యాట్ తో బౌలర్ల ను ఊచకోత కొనసాగిస్తున్నాడు. ఒకే ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు బాదేసి తానేమిటో మరోసారి చాటిచెప్పాడు. అనితరసాధ్యం కాని అరుదైన రికార్డ్ ను నెలకొల్పి భారత బ్యాటింగ్ లైనప్ కి తానే వెన్నెముకగా గా మారిపోయాడు రోహిత్.

కుమార సంగక్కర రికార్డ్ చెరిపేసి ….

ఇప్పటివరకుఒక ప్రపంచ కప్ లో శ్రీలంక స్టార్ కుమార సంగక్కర నాలుగు సెంచరీలతో నెలకొల్పిన రికార్డ్ మాత్రమే వుంది. బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సంగక్కర రికార్డ్ ను సమం చేశాడు రోహిత్. అక్కడితో ఆగలేదు. తాజాగా శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో మరో సెంచరీ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్ ను తనపేరిట లిఖించాడు రోహిత్ శర్మ. ఈ సెంచరీతో మొత్తం తానాడిన ప్రపంచకప్ పోటీలలో సచిన్ చేసిన ఆరు సెంచరీలను సమం చేసాడు శర్మ. భారత్ సెమిస్ చేరిన నేపథ్యంలో మరో మ్యాచ్ ఆడనుంది. సెమిస్ నుంచి ఫైనల్ చేరితే రెండు మ్యాచ్ లలో మరికొన్ని రికార్డ్ లను రోహిత్ నెలకొల్పడం తధ్యమంటున్నారు క్రీడా నిపుణులు. చూడాలి రోహిత్ బ్యాట్ తో మరిన్ని మ్యాజిక్ లు చేస్తాడో.

Tags:    

Similar News